Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎస్ఇబి అధికారులపై చర్యలు తీసుకోవాలి

కొయ్యలగూడెం: మండలంలోని పొంగుటూరు గ్రామానికి చెందిన కొల్లూరు
దుర్గారావు మృతికి కారకులైన ఎస్ ఈ బి అధికారులను వెంటనే విధుల నుండి తొలగించాలని కోరుతూ పొంగుటూరు గ్రామంలో మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మృతి చెందిన దుర్గారావు భార్య సీతా మహాలక్ష్మి మాట్లాడుతూ గత నెల 5వ తేదీన ఎక్సైజ్ పోలీసులు తన భర్త దుర్గారావును బెల్లం అమ్ముతున్నాడని భోజనం చేస్తున్న తన భర్తను ఇంటి నుండి జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లడం జరిగిందన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు అదే రోజున జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళగా మర్నాడు పంపుతామని చెప్పి పంపలేదన్నారు. 4 రోజుల తర్వాత ఏలూరురైల్వే స్టేషన్ పరిధిలో రైల్వే పట్టాలపై దుర్గారావు మృతి చెందాడని రైల్వే పోలీసులు సమాచారం అందించారని, ఎస్ఇబి ఎక్సైజ్ పోలీసులమని చెప్పి తన భర్తను ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి వారి కస్టడీలో ఉన్న వ్యక్తి ఎలా రైలు పట్టాలపై మృతి చెందాడని ఆమె ప్రశ్నించారు. ఇది ఎక్సైజ్ పోలీసుల హత్యని ఆమె ఆరోపించారు. గత నెల 9వ తేదీన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు, ఆర్యవైశ్య సంఘం నాయకులు గ్రామంలో రహదారిపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని ఆందోళన నిర్వహించగా సంబంధిత
ఎస్ఈబి సిఐ, ఎస్ ఐ, కానిస్టేబుల్ లను సస్పెండ్ చేసినట్లు పోలీస్ అధికారులు తెలపడంతో ఆందోళన విరమించామన్నారు. అధికారులు మాయమాటలు చెప్పి తమను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. దుర్గారావు మృతికి కారకులైన అధికారులు విధుల్లోనే కొనసాగుతున్నారని పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు తెల్లం బాలరాజు దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ ఇంతవరకు వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని మృతుడు తమ్ముడు కొడుకు బాలాజీ పేర్కొన్నారు. తమ కుటుంబానికి పెద్దదిక్కు కోల్పోయి అనేక ఇబ్బందులు పడుతున్న తమకు న్యాయం చేయాలని, న్యాయం జరగని పక్షంలో రహదారిపై బైఠాయించి ఆందోళన కార్యక్రమం, ధర్నా నిర్వహిస్తామని మృతుడి కుటుంబ సభ్యులు హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మృతుడి కుమార్తె అన్నపూర్ణ, అల్లుడు శ్రీనివాసరావు, గ్రామస్తులు. పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img