Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆరోగ్యశ్రీ సేవలు అవగాహన కల్పించాలి

కొయ్యలగూడెం: ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ప్రభుత్వం అందజేస్తున్న సేవలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని జంగారెడ్డిగూడెం డివిజనల్ టీం. లీడర్ కె. భారతి తెలిపారు. కొయ్యలగూడెంలో గురువారం కొయ్యలగూడెం మండలం, గోపాలపురం మండలాల సచివాలయాల ఏఎన్ఎంలకు, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవెడర్ లకు శిక్షణ కార్యక్రమాన్ని లలిత ప్రియ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఉండే గ్రామ సచివాలయ ల పరిధిలో ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే రోగులను గుర్తించి వారికి సరైన వైద్యం అందించే విధంగా దగ్గరలో ఆరోగ్యశ్రీ వైద్యం అందించే ఆసుపత్రికి తీసుకువెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ ఆరోగ్యశ్రీ ప్రవేశ పెట్టడం ద్వారా అనేకమంది లబ్ధి పొందుతున్నారన్నారు. లలిత ప్రియ ఆర్థోపెడిక్ ఆసుపత్రి వైద్యులు రాజశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం ద్వారా అన్ని రకాల వారికి వైద్యం అందిస్తున్నామని ఆరోగ్యశ్రీ పథకంలో 2,446 వ్యాధులకు చికిత్స చేయడం జరుగుతుందని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి, తెలియని వారికి తెలియ చెప్పాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లలిత ప్రియ ఆసుపత్రి సిబ్బంది ప్రమోద్, సుధీర్, ఆరోగ్యశ్రీ పథకం సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img