Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఎమ్మెల్యే ఎమ్మెల్సీలపై దాడి చేయడం హేయమైన చర్య

టిడిపి ఎస్ సి సెల్ కమిటీ ..

పాలకొల్లు: స్వార్థ రాజకీయాల కోసం దళితులను పాలుగా వాడుకోవడం, స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్లపై దాడులు చేయించడం హేయమైన చర్య అని టిడిపి ఎస్ సి సెల్ కమిటీ అభిప్రాయపడింది. మంగళవారం పాలకొల్లు ప్రెస్ క్లబ్ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్ సి సెల్ నాయకుడు మాజీ ఎంపీపీ దాసరి రత్నరాజు మాట్లాడుతూ ఎస్ సి చట్టాలను నీరుగార్చే విధంగా కొంతమంది ఎస్ సి, ఎస్ టిలను పురమాయించి ప్లాన్ ప్రకారం ఎమ్మెల్యే ఎమ్మెల్సీలపై దాడి చేయించారని ఆరోపించారు. ఈ ఘటన తో రాష్ట్రంలోని ఎస్ సి, ఎస్ టి లకు అవమానం జరిగినట్లు భావించాలన్నారు. మాతా రత్నం రాజు మాట్లాడుతూ వెంటనే ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పై పెట్టిన ఎస్ సి, ఎస్ టి అట్రాసిటీ కేసు ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్తేరు రాణి మాట్లాడుతూ పెట్టిన కేసులను వెంటనే విరమించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నారు. పసుపులేటి ప్రభుదాసు మాట్లాడుతూ స్వార్థ రాజకీయాల కోసం ఎస్ సి, ఎస్ టిలను పావులుగా వాడుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పీతల శ్రీనివాస్, జల్లి యేసు, పాముల రజిని, ఉందుర్తి సురేష్ యల్లమెల్లి వెంకటరావు, పి మాధవరావు, కోటి రాంబాబు, రాపాక విజయరత్నం, సర్పంచ్ కొండేటి జీవరత్నం, సర్పంచ్ బుడితి జయరాజు, వడ్లపాటి రాజేంద్రప్రసాద్, విప్పర్తి శారద, ఎంపీటీసీ చిట్టిబాబు, ఎంపీటీసీ గెడ్డం కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img