Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

బుట్టాయిగూడెం: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్.బి.ఎస్.కె జిల్లా కోఆర్డినేటర్ డా. సిహెచ్ మానస అన్నారు.బుట్టాయగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో నాన్ కమ్యూనకబుల్ డిసీజెస్ నియంత్రణ ప్రోగ్రామ్ అధికారి, ఆర్.బి.ఎస్.కే. జిల్లా కోఆర్డినేటర్ డా.సిహెచ్. మానస విస్తృతంగా పర్యటించి ఆరోగ్య కేంద్రాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బయ్యనగూడెం, కొయ్యలగూడెం, పులిరామన్నగూడెం లలో పర్యటించిన డా. మానస ఆరోగ్య కేంద్రాలలో బయో మెట్రిక్ హాజరు, ఎన్ సి డి సర్వే, పాఠశాలల్లో బాలల ఆరోగ్య పరీక్షల నిర్వహణ తీరుపై ఆరా తీశారు. సీజనల్ జ్వరాలపై వ్యాపించకుండా ఉండేందుకు తీసుకోవలసిన చర్యపై సిబ్బందిని ఆదేశించారు. రాపిడ్ కిట్లు, అవసరమైన మందులు అందుబాటులో ఉన్నవి పరిశీలించారు. జిల్లాలో అసంక్రమిత వ్యాధుల నివారణకు సంబంధించి సర్వే సమర్థవంతంగా నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. పాఠశాల్లో బాలబాలికలకు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం కింద ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. వీరిలో కంటిచూపు, రక్తహీనత, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న బాల బాలికలను గుర్తించి వారికి అవసరమైన చికిత్స అందేలా చూడాలన్నారు. అసంక్రమిత వ్యాధులలో ముఖ్యంగా రక్తపోటు, మధుమేహం, అజీర్ణం, తదితర సమస్యలు ప్రధానంగా ఉంటాయన్నారు. పౌష్టికాహార లోపం, మద్యం సేవించడం, ధూమపానం, అసంక్రమిత వ్యాధులు ప్రబలడానికి ప్రత్యక్ష కారణాలు అవుతాయన్నారు. ఇటువంటి పరిణామాలు గుర్తించేందుకు ప్రభుత్వం ఎన్ సి డి సర్వే ను నిర్వహిస్తున్నదన్నారు.డా. మానస వెంట డా. ప్రియాంక , కొవిడ్ నోడల్ అధికారి , టెక్నికల్ సిబ్బంది రవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img