Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

కాలేయ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలి

ఏలూరు: కాలేయ వ్యాధులపట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని డా. జి. సుమంత్ అన్నారు. స్థానిక రామచంద్రరావుపేట లోని సాయి స్ఫూర్తి ఆసుపత్రిలో మంగళవారం ఉచిత కాలేయ వ్యాధి నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉచితంగా వ్యాధి పరీక్షలు చేసి, పలు ఆరోగ్య సూచనలు చేశారు. ఈ సందర్భంగా డా. సుమంత్ మాట్లాడుతూ కాలేయం మెదడు తరువాత శరీరంలో రెండో అతిపెద్ద , అత్యంత క్లిష్టమైన అవయవమని, జీర్ణవ్యవస్థను నియంత్రించడంలో, శరీరంలోని వ్యర్ధ పదార్థాలను తొలగించడంలో ఎంతగానో సహాయం చేయిస్తుందన్నారు.రోగ నిరోధకశక్తి, జీర్ణక్రియ, జీవక్రియలకు కాలేయం అత్యంత ప్రధానమైనదన్నారు. కాలేయం వైరల్ హెపటైటిస్, ఫ్యాటీ లివర్ వంటి వ్యాధుల బారిన పడకుండా ప్రతీ ఒక్కరూ అవగాహనతో ముందుగానే వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. శరీరంలో అధిక కొవ్వులు పేరుకుపోవడంతో ఫ్యాటీ లివర్ వంటి వ్యాధులకు గురవుతుంటారని, వ్యాధిని ముందుగానే గుర్తించినట్లయితే ఎన్నో ధీరకాలిక వ్యాధులకు గురికాకుండా నివారించవచ్చన్నారు.కాలేయ వ్యాధుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 1. 34 మిలియన్ మంది చనిపోతున్నారన్నారని, అతిగా మాంసాహారం, మద్యపానం, సాఫ్ట్ డ్రింక్స్ సేవించడం, శరీరానికి భౌతిక వ్యాయాయం లేకపోవడం, వేపుళ్ళు, ఆయిల్ ఫుడ్స్ అతిగా తీసుకునేవారు కాలేయ వ్యాధులబారిన పడుతున్నారన్నారు. ప్రతీరోజు క్రమం తప్పకుండా కనీసం అరగంటసేపు వ్యాయాయం లేదా నడక అలవాటుచేసుకోవాలని, దానితో పాటు కాలేయాన్ని వ్యాధులకు గురిచేసే ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండాలని డా. సుమంత్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ స్వచ్చంద సంస్థ సభ్యులు సురేష్ కుమార్, జి. ఆనంద్, ఎస్. రాజ్ కుమార్, పృద్విరాజ్, ప్రభృతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img