Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పోలవరం సహకార సంఘానికి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్…!

పిఎసిఎస్ చైర్మన్ చెలికాని బాబ్జి

విశాలాంధ్ర – చాట్రాయి : పోలవరం సహకార సంఘానికి బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు దక్కిందని సహకార సంఘం చైర్మన్ టెలికాం బాబ్జి తెలిపారు.అప్కాబ్ ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన రాష్ట్రస్థాయి సభలో సహకారశాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డు తీసుకోవాడం చాలా ఆనంద దాయకంగా వుందన్నారు.తనమేనమామ కీర్తి శేషులు బుల్లి బాబు గారు సహకార సంఘ అధ్యక్షులుగా సుదీర్ఘ కాలం పనిచేసారని అప్పటినుంచే సంఘం నడపడంలో అనేక సందర్భాలలో కీలకమైన పాత్ర పోషించానని గుర్తుచేసుకున్నారు. జిల్లా స్థాయి లో పోలవరం సంఘానికి పూర్వంనుంచి మంచి గుర్తింపు కలిగివుందని బెష్ట్ పర్మామెన్స్ అవార్డు రావడం ఇదే తొలిసారి అని తెలిపారు. ఈకార్యక్రమంలో పిఏసిఎస్ సిఇఓ వడాలి ఏసుప్రసాదరాజు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img