Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆదివాసి చట్టాలకు తూట్లు పొడుస్తున్న బిజెపి

బుట్టాయిగూడెం: ఆదివాసీ చట్టాలకు తూట్లు పొడిచే విధంగా మోడీ ప్రభుత్వం తెస్తున్న సవరణలకు ప్రతి గిరిజనుడు ఉద్యమించాలని ఎఐకెఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ధర్ముల సురేష్ అన్నారు. సోమవారం స్థానిక రామనర్సయ్య భవనంలో వెట్టి సుబ్బన్న అధ్యక్షతన అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా కమిటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సురేష్ మాటాడుతూ కేంద్ర ప్రభుత్వం నియమించిన ఎంయస్పి కమిటీలో రైతాంగ వ్యతిరేక నల్ల వ్యవసాయ చట్టాల సమర్ధకుల ప్రాతినిధ్యంతో నింపడం హేయమైన చర్యని అన్నారు. ఆ కమిటీలో కిసాన్ సంయుక్త మోర్చా భాగస్వామ్యం కాకూడదని వ్యతిరేకిస్తూ జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, పోలవరం, కొయ్య మండలలలో తాహాశీల్దార్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించాలన్నారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా ఆదివాసీ గిరిజనలు ఆదివాసీల హక్కులకై జంగారెడ్డిగూడెం ఆర్ డి ఓ ఆఫీసు ముందు జరిగే నిరసన కార్యక్రమానికి అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలన్నారు. వరదల కారణంగా ఇల్లు మునిగి నిరాశ్రయులైన ప్రతి ఒక్కరిని రాష్ట్ర ప్రభుత్వ ఆదుకుని రూ.15 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటి సభ్యులు పి శ్రీనివాస్, వి వెంకటేశ్వరరావు కలం రామన్న, ముసలారెడ్డి, కారం రాఘవ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img