Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

కాలువలపై వంతెనలు నిర్మించాలి

కొయ్యలగూడెం: మండలంలోని కాలువలపై వంతెనలు నిర్మించాలని టిడిపి నాయకులు ఆకుమర్తి సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలో దిప్పకాయలపాడు గ్రామంలో ఎస్ సి కాలనీ కి వెళ్ళటానికి మధ్యలో కొండ ప్రాంతాల నుండి వచ్చే కాలువ ఉదృతంగా ప్రవహించడంతో ఎస్ సి కాలనీ కి వెళ్లే ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దిప్పకాయలపాడు గ్రామం నుండి కిచ్చప్ప గూడెం, వంకబొత్తగూడెం, సరిపల్లి, బయ్యన గూడెం గ్రామాల కు వెళ్లే ప్రజల రాకపోకలు నిలిచిపోయాయి. దిప్పకాయలపాడు గ్రామం ఎస్ సి కాలనీకి చెందిన టిడిపి నాయకులు ఆకుమర్తి సురేష్ మాట్లాడుతూ కాలనీ కి రావాలంటే కాలువ దాటుకుని రావాలని ఎస్ సి కాలనీలో సుమారు 800 కుటుంబాలవారు నివసిస్తున్నారని అత్యవసర పరిస్థితుల్లో మండల కేంద్రమైన కొయ్యలగూడెం పట్టణానికి వెళ్లాలన్నా ఈ కాలువ దాటుకొని వెళ్లాలని వర్షాలు కారణంగా కాలువ ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోతున్నాయని గ్రామస్తులు అనేక ఇబ్బందులను చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి కాలువపై వంతెన నిర్మించాలని సురేష్ కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img