Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

3నెలలలో జగనన్న కాలనీ నిర్మాణం పూర్తి

ఏలూరు : 3 నెలల్లో జగనన్న ఇళ్ల కాలనీ పూర్తి చేస్తామని నగరపాలక సంస్థ కమిషనర్ షేక్ షాహిద్ తెలిపారు. నగరంలోని స్థానిక పోణంగి గ్రామంలో నిర్మించనున్న జగనన్న కాలనీలను కార్పొరేటర్లు బండారు కిరణ్ కుమార్, సాంబశివ, లబ్ధిదారులతో కలిసి మంగళవారం కమిషనర్ పర్యటించారు. ఇళ్ల కాలనీలో లబ్ధిదారులకు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలను త్వరితగతిన పూర్తి పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులు, సంబంధిత అధికారులకు కమిషనర్ సూచించారు. కాలనీలో జెసిబి ఉపయోగించి పిచ్చి మొక్కలు తొలగింపు నకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లనిర్మాణానికి అవసరమైన సామాగ్రిని అందిస్తామని ముందుగానే రూ.35 వేలు నగదును లబ్ది దారుల ఖాతాల్లో జమ చేస్తామని కమిషనర్ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img