Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

సిపిఐ ఏలూరు జిల్లా నూతన సహాయ కార్యదర్శి ఉద్యమ నేపథ్యం

ఏలూరు:ఏలూరు నగరంలో సొంతంగా మెకానిక్ షెడ్లు నిర్వహిస్తూ ఆటోనగర్ లో స్థల కేటాయింపులు చేయాలని మెకానిక్ లు చేస్తున్న పోరాటంలో సాధారణ మెకానిక్ గా పాల్గొంటూ కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న,చేసిన ఉద్యమాల పట్ల ఆకర్షితుడై 2012 జూన్ 2, వ తేదీన పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు.ఆటోనగర్ సమస్య పరిష్కారం కోరుతూ పార్టీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన 83 రోజుల రిలే నిరాహార దీక్షలో చురుకుగా పాల్గొన్నారు.
ఆనాటి ఏలూరు పట్టణ పార్టీ కార్యదర్శి ఆర్ఎస్ డాంగే సహకారంతో పార్టీ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటూ 2014లో ఏలూరు నగర యువజన సమాఖ్య కార్యదర్శిగా ఎన్నుకోబడి, సిపిఐ ఏలూరు సమితిలోకి ఆహ్వానితునిగా ఎన్నుకున్నారు.
పార్టీ కార్యక్రమాల్లో పూర్తిస్థాయిలో పాల్గొంటూ పార్టీ పట్ల నిబద్ధతతో ఏలూరు నగరంలోని ఒకటవ పట్టణ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా 19వ డివిజన్ లో పార్టీ శాఖ ఏర్పాటు చేసి 2015 మే 1వ తేదీన పార్టీ స్తూపాన్ని నిర్మించి జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభింపజేశారు.2016 చింతలపూడిలో జరిగిన యువజన సమాఖ్య జిల్లా మహాసభలో ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడినా ఏలూరు నగరంలో,తమ ప్రాంతంలో పార్టీ పనులు,మరియు తన సొంత వ్యాపారం దృష్ట్యా పూర్తిస్థాయిలో యువజన సమాఖ్యలో పనిచేయలేకపోయారు.నగరంలో పార్టీ కార్యక్రమాల జయప్రదానికి కృషి చేస్తూ 2018 పార్టీ 25వ మహాసభ అనంతరం జిల్లా కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికయ్యారు.
గుంతకల్లులో జరిగిన జనసేవాదళ్ రాష్ట్ర శిక్షణ శిబిరానికి హాజరయ్యి ,
శిక్షణ పొంది అనంతరం అమలాపురం,
తిరుపతి, విజయవాడ క్యాంపులలో శిక్షకుడుగా వ్యవహరించారు. రాష్ట్ర జనసేవాదళ్ సబ్ కమిటీ సభ్యునిగా కొనసాగుతున్నారు.ఏలూరు నగరంలో 15,16 డివిజన్ లో జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన బ్రాందీ షాపులను తొలగించాలని, అప్పటి నగర కార్యదర్శి పుప్పాల కన్నబాబు ఆధ్వర్యంలో పోరాటం చేసి విజయం సాధించారు.
భీమోలు భూ సమస్య పోరాటంలో జిల్లా పార్టీ కార్యక్రమాన్ని అమలుపరచడంలో, కోర్టు వ్యవహారాలలో, భూమి రికార్డులను సమీకరించడంలో, క్రియాశీలకంగా వ్యవహరించారు. అనంతరం జిల్లా కార్యవర్గ సభ్యునిగా ఎన్నికవ్వడం, పార్టీ హోల్ టైమర్ గా,ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శిగా, ఏలూరు ఏరియా కన్వీనర్ గా,ఇప్పుడు ఏలూరు ఏరియా కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
ఎటువంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చి నేడు ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శిగా ఎన్నిక కావడం ఒక్క సీపీఐ పార్టీలోనే సాధ్యమవుతుందని రుజువు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img