Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

సీపీఐ ప.గో.జిల్లా నాయకుడు వైట్ల విద్యాధర్ మృతి

ఆచంట:సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వైట్ల విద్యాధర్(50) ఆదివారం రాత్రి 1 గంట సమయంలో గుండె పోటుతో ఆచంట మండలం వేమవరంలో తన నివాసమందు మృతి చెందారు.
వైట్ల విద్యాధర్ కు భార్య,ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.విద్యాధర్ విద్యార్థి,యువజన సమాఖ్య లలో చురుగ్గా పనిచేశారు.రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా రైతాంగ సమస్యలు పరిష్కారానికి జరిగిన అనేక ఉద్యమాల్లో పనిచేశారు.సీపీఐ ఆచంట ఏరియా కార్యదర్శిగా పనిచేశారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యునిగా వున్నారు.ప్రజా సమస్యలు పరిష్కారానికి పార్టీ నిర్వహించిన అనేక పోరాటాల్లో తనవంతు కృషి నిర్వహించారు.
పార్టీ పట్ల ఎంతో అంకితభావంతో పనిచేసిన విద్యాధర్ మృతికి సీపీఐ పశ్చిమగోదావరి జిల్లా సమితి కార్యదర్శి కోనాల భీమారావు తీవ్ర సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.విద్యాధర్ భౌతికకాయంపై భీమారావు, పార్టీ నాయకులు నెక్కంటి సుబ్బారావు,
డేగా ప్రభాకర్, బండి వెంకటేశ్వరరావు, కలిశెట్టి వెంకట్రావు, ఎం.సీతారాం ప్రసాద్ ,బొద్దాని నాగరాజు,సీహెచ్.రంగారావు,నెక్కంటి క్రాంతి కుమార్ పార్టీ పతాకాన్ని కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విద్యాధర్ మృతి కుటుంబ సభ్యులకు, పార్టీకి,ప్రజా ఉద్యమాలకు తీరనిలోటని ఆయన సేవలను కొనియాడారు.
సీపీఐ నాయకులు వేండ్ర నాగరాజు, పీసీ జోషి,జక్కంశెట్టి నాగేశ్వరరావు,ఎం.లక్ష్మిపతి,వై.విజయానంద్ ,జౌదుల వెంకటరత్నం,ఉల్లింకల జయకృష్ణ,బి.లక్ష్మినారాయణ,డేగా హనుమంతరావు,పంతం నాగులు,కె.హనుమంతు, నమ్మి నాగరాజు,మండల నాగేశ్వరరావు,తాడికొండ గంగాభవాని, ఉపాధ్యాయ సంఘ నాయకులు పి.ఎస్.ప్రతాపరాజు తదితరులు విద్యాధర్ భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

విద్యాధర్ మృతికి సిపిఐ రాష్ట్ర నాయకుల సంతాపం…

విద్యాధర్ మృతికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శులు ముప్పాళ్ళ నాగేశ్వరరావు, జెవి సత్యనారాయణమూర్తి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఓబులేసు, తీవ్ర సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యాధర్ చిన్న వయసులోనే మృతి చెందడం బాధాకరమన్నారు. పార్టీ ఉద్యమాలకు తీరనిలోటని పేర్కొన్నారు.

మహిళా సమాఖ్య సంతాపం…

సిపిఐ నాయకుడు వైట్ల విద్యాధర్ మృతికి మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నెక్కంటి జగదాంబ, జిల్లా ప్రధాన కార్యదర్శి సికిలే పుష్పకుమారి తీవ్ర సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. విద్యాధర్ మృతి పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరనిలోటన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img