Monday, October 3, 2022
Monday, October 3, 2022

అభివృద్ధి పనులపై దృష్టి సారించండి

కమిషనర్ షేక్ షాహిద్

ఏలూరు: నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులపై దృష్టి సారించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కమిషనర్ షేక్ షాహిద్ అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని అభివృద్ధి , పెండింగ్ పనులు , ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు వాటి పరిష్కారం పలు అంశాలపై అన్ని విభాగాల అధికారులతో కమీషనర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ షాహిద్ మాట్లాడుతూ గడపగడపకు మన ప్రభుత్వం, స్పందన, సచివాలయాలకు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులు పై ఏం చర్యలు తీసుకున్నారు, ఎన్ని పరిష్కరించారు అని సంబంధిత శాఖ అధికారులను కమిషనర్ అడిగి తెలుసుకున్నారు. అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రజా సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పనిచేయాలని, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు . గృహ నిర్మాణానికి సంబంధించి అధికారులు గుర్తింపు పొందిన కాంట్రాక్టర్లను గుర్తించి వారిద్వారా ఇళ్ల నిర్మాణాలు చేపట్టి త్వరిత గతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా నగరంలో ప్రసిద్ధిగాంచిన బుద్ధ పార్క్ అభివృద్ధి పనులను పూర్తి చేసి నెల రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల న్నారు. నగరంలో ఉన్న పార్కుల అభివృద్ధి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు. డివిజన్లో డ్రైనేజీల నిర్మాణం , సిసి రోడ్ల మరమ్మత్తుల పనులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి నాణ్యత ప్రమాణాలు పాటించాలనీ కమిషనర్ అధికారులకు సూచించారు. శానిటేషన్ పై పారిశుద్ధ్య విభాగం అధికారులు,సిబ్బంది సచివాలయ వాలంటీర్లు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకుని క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించా లన్నారు. పందులు పెంపకం దారులకు డంపింగ్ యార్డ్ లో రెండు ఎకరాల స్థలం కేటాయించామని, వాటి నిర్మూలనకు హెల్త్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవా లన్నారు. ప్రభుత్వం అందించే ప్రభుత్వ పథకాలు, పౌర సేవలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని అందుకు ప్రతి ఉద్యోగి బాధ్యతతో పనిచేయాలని కమిషనర్ షాహిద్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ బాపిరాజు డిప్యూటీ కమిషనర్ వెంకటేశ్వరరావు మేనేజర్ మూర్తి,ఇంజనీరింగ్ అధికారులు భాస్కరరావు ,సత్యనారాయణ, కొండలరావు, తాతబాబు, ఎంహెచ్వోలు గోపాల్ నాయక్ మాలతీరాణి, పి.వో కృష్ణమూర్తి , రెవిన్యూ అధికారులు పలు విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img