దోసపాడు దళితులకు న్యాయం చేయలేని కలెక్టర్, ఆర్ డి ఓ, ఎస్ పి, డి ఎస్ పి, తహసిల్దార్లు…
చట్టాలను అమలు చేయాల్సిన అధికారులే ధిక్కరిస్తే ఏం చేయాలి…?
దోసపాడు గ్రామంలో ముగిసిన రిలే నిరాహార దీక్షలు…
విశాలాంధ్ర -దెందులూరు: చట్టబద్ధంగా పేదల భూములకు, దళితులకు రక్షణ కల్పించాలని, అసైన్డ్ భూముల చట్టం సెక్షన్ 4 ప్రకారం నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా శుక్రవారం నాడు దోసపాడు గ్రామంలో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న పేదలు,దళితులను కలిసి మద్దతు తెలిపే మాట్లాడినారు. పేదల భూములకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. భూస్వాములకు ప్రభుత్వం అండగా నిలబడటం సిగ్గుచేటు అన్నారు. చట్టాన్ని అమలు చేయవలిసిన అధికారులే భూస్వాములు కొమ్ము కాయడం దుర్మార్గమన్నారు. 2015లో గౌరవ లోకాయుక్త ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా,జిల్లా కోర్టు ఇచ్చిన స్టేటస్కో ఆర్డర్ అమలు చేయకుండా చట్టాన్ని ధిక్కరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దోసపాడు గ్రామం ప్రజాస్వామ్యంలో ఉందా? లేక రాజరిక పరిపాలనలో ఉందా? అని ప్రశ్నించారు. గత వారం రోజుల నుంచి పేదలు, దళితులు గ్రామ సచివాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తుంటే అధికార పార్టీ నాయకులు గానీ, ఎమ్మెల్యే,మంత్రులు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. ఇదేనా మీ ప్రభుత్వం దళితులకు ఇచ్చే ప్రాధాన్యత అని ప్రశ్నించారు. దళితులు,పేదల పట్ల ఎందుకు ఇంత వివక్షత అని ప్రశ్నించారు. ఓట్లఅప్పుడే పేదలు,దళితులు మీకు కనబడతారాని ఎద్దేవా చేశారు. పేదలు దళితుల కోసం పనిచేస్తామని చెప్పే నాయకులు ఏమయ్యారని ప్రశ్నించారు. భూస్వాములకు రక్షణ కల్పించే అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత నాలుగు దశాబ్దాల క్రితమే కొల్లేరు పక్కనున్న భూములు దళితులు,పేదలు వ్యవసాయ పంట పండించుకొని సాగు చేసుకుంటున్నారని ఆ భూములను విజయవాడకు చెందిన దేవినేని భాజీ ప్రసాద్, బీహార్ కు చెందిన పప్పు సింగ్ ఇతర స్థానిక భూస్వాములు స్థానికేతర గుండాలు పేదల నుండి దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులు కు న్యాయం చేయాలని వారి హక్కులను భంగం కలపకుండా కాపాడాల్సిన జిల్లా కలెక్టర్, ఆర్డిఓ, ఎస్పి, డిఎస్పి సోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. భూస్వాములకు తొత్తులుగా జిల్లా అధికారుల వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు. ఏప్రిల్ 10వ తేదీ లోపు దోసపాడు పేదలకు న్యాయం చేయాలని పక్షంలో మరో మారు మా భూముల్లోకి దిగి చేపలు పట్టి భూములను స్వాధీనం చేసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెంటనే గ్రామాల్లో ఉన్న 144, 145 సెక్షన్లను ఎత్తివేయాలని, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులో ఉన్న నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, భూస్వాములు నుండి భూముల స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. దీక్షలో కూర్చున్న వారికి నిమ్మరసం అందజేసి విరమింప చేశారు.అనంతరం గ్రామ సచివాలయం సెక్రెటరీ పి.ఆదిలక్ష్మి మండల రెవెన్యూ శాఖ అధికారి నాంచారయ్య లకు వినతిపత్రం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడుతూ గత వారం రోజుల నుండి పేదల చేస్తున్న రిలే దీక్షలో విరమింప చేయడమే తప్ప ఆపడం లేదన్నారు. ఏప్రిల్ 10వ తేదీ లోపు ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారం అయ్యే దిశగా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో మరోసారి భూములలోకి వెళ్లి చేపలు పట్టి భూములను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. తదుపరి జరిగే పరిణామాలు అన్నిటికీ ఈ జిల్లా రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారుల బాధ్యత వహించాలని హెచ్చరించారు. గౌరవ జిల్లా కోర్టు, గౌరవ లోకాయుక్త ఇచ్చిన ఆదేశాలను అమలు చేసే పేదలకు భూమి పంచాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు పి.ఆనందరావు, డి.నాగేంద్ర, పి సునీల్,సిహెచ్ మనీ,సిహెచ్ యేసు మని, లలిత, పవన్, గంగాధర్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.