Friday, April 19, 2024
Friday, April 19, 2024

రూ.కోటి 70 లక్షలతో అభివృద్ధి పనులు

సర్పంచ్ కమతం సౌజన్య బెనర్జీ

విశాలాంధ్ర – ఉండి : సర్పంచిగా ఎన్నికైన రెండు నర సంవత్సరాల కాలంలో ఉండి పంచాయతీ పరిధిలో రూ.కోటి 70 లక్షల నిధులతో సిసి రోడ్లు, డ్రైనేజీలు, గ్రావిల్ రోడ్లు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ఉండి సర్పంచ్ కమతం సౌజన్య బెనర్జీలు తెలిపారు. ఉండి పంచాయతీ కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ ఉండి గ్రామాభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు మాకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో వారి సహాయంతో ఇంకా అభివృద్ధి పనులు కాబట్టి ఉండి గ్రామాన్ని సంపూర్ణ అభివృద్ధి చేస్తామని తెలిపారు. రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని ఉండి గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు సంపూర్ణంగా అందించేందుకు ఫిల్టర్ బ్లడ్ లను శుభ్రపరిచి స్వచ్ఛమైన నీరు అందించేందుకు కార్యచరణ చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఆశయ సాధనకై కృషి చేస్తామన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం వరకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉండి గ్రామ ప్రజలకు సంపూర్ణంగా సేవలు అందిస్తామన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ ఫలాలు అన్ని అందేలా కృషి చేస్తానని తెలిపారు. పదవీకాలం ముగిసే నాటికి గ్రామంలో పూర్తి మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తామన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img