Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

దిక్కులేని దివాణం పోతనపల్లి గ్రామ సచివాలయం…?

మంజూరు అయింది 11పోస్ట్ లు పనిచేసేది ఇద్దరే….?
మండలంలో షుమారు 60 పోస్టులు ఖాళీ…..?

విశాలాంధ్ర – చాట్రాయి : పోతనపల్లి గ్రామ సచివాలయం దిక్కులేని దివానంగా మారిందని…? సిబ్బంది లేక అక్కడ పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ….?ఉన్నాయని పలువురు అంటున్నారు.మండలం లో 16 గ్రామ సచివాలయలలో 176 కాగా ప్రస్తుతం చాట్రాయి మండలం లో 116 మంది సిబ్బంది వరకు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. అంటే అరవై ఖాళీలున్నాయి. గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను ఊరుదాటి కాలు బయట పెట్టకుండా కొన్ని వందల రకాల సేవలను ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు అందించాలనేది మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రధాన ఉద్దేశం. అదే మాట చెబుతున్నారు.. మనం వింటూనే ఉన్నాం…. మండలం లో18 గ్రామ పంచాయతీలు ఉండగా 16 గ్రామాల్లోనే గ్రామ సచివాలయాలు మంజూరు చేశారు.సచివాలయాల ఏర్పాటు లోనే అనేక లోపాలు , రాజకీయాలు జరిగాయి . సచివాలయంలో 11 విభాగాలు 11 మంది ప్రదాన సిబ్బంది ధ్వారా అన్ని విదాల సేవలు అందించాలనేది ప్రభుత్వ ఉద్దేశ్యం. పోతనపల్లి అత్యధిక శాతం గిరిజనులు నివాసం వుండే గ్రామంలో కేవలం 2 సిబ్బంది మాత్రమే ఉన్నారు. సిబ్బంది లేక అక్కడ పడుతున్న ఇబ్బందులు అన్నిన్నికావు.సచివాలయంలో సిబ్బంది లేక దిక్కు లేని దివానంలా వుందని పలువురు అంటున్నారు.2019అక్టోబర్ 2వ తేదిన సచివాలయ వ్యవస్థ ప్రారంభంకాగా నేటికీ పోతనపల్లి లో పరిస్థితి మారనేలేదు అన్నది నగ్న సత్యం. మండలం మొత్తం లో 60 మంది లేరు. ప్రభుత్వం వేంటనే సిబ్బంది ని నియమించాలని పలువురు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img