Friday, April 19, 2024
Friday, April 19, 2024

కాలేజీని పోగొట్టకండి పిల్లల్ని చేర్పించండి…..?

నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు

విశాలాంధ్ర – చాట్రాయి : ప్రభుత్వ జూనియర్ కాలేజీ మంజూరు ….చేయించాను…పిల్లలు ఏరి….?విద్యాశాఖాధికారి ఎక్కడా….? కాలేజీ పోగొట్టకండీ పోతే రాదని నూజివీడు శాసనసభ్యులు మేకావెంకట ప్రతాప అప్పారావు హెచ్చరించారు.సోమవారం సాయంత్రం మండలపరిషత్ కార్యలయంలో నూతన పించన్లు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరైయ్యారు. ఇసందర్బంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ. చాట్రాయి మండలం లో విద్య అభివృద్ధి కై జూనియర్ కాలేజీ మంజూరుచేయించానని ఇప్పటికీ పిల్లల్ని కేవలం నాలుగు మంది నే జరిపించినట్టు తన దృష్టికి వచ్చిందని ఇలా అయితే కాలేజీ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. విధ్యాశాఖదికారులకు సమావేశం పెట్టి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగిందన్నారు. నియోజకవర్గం మొత్తం నాలుగు కాలేజీలు వచ్చాయనితెలిపారు. అన్నిచోట్లా పిల్లల్ని బాగా నే జాయిన్ చేస్తున్నారని చాట్రాయి లో అలా ఎందుకు జరగడం లేదని ప్రశ్నించారు…? అందరూ బాధ్యత తీసుకుని కాలేజీని కాపాడాలని కోరారు. హష్టల్ కూడా మంజూరుచేయిస్తానని తెలిపారు. ప్రభుత్వం ద్వారా నాణ్యమైన విద్యను అందించగమని ధీమా వ్యక్తం చేశారు. చాట్రాయి లో ఈరోజు 294 పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. కాపు నేస్తం,వాహన మిత్ర మొత్తం ఎనిమిది వందల మంది వరకు ఈరోజు ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. ఐదు సంవత్సరాల పాటు అసమర్థ పాలన సాగించిన తెలుగుదేశం పార్టీ నేడు కల్లబొల్లి కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఎఏం సి మాజీ చైర్మన్ దేశి రెడ్డి రాఘవ రెడ్డి మాట్లాడుతూ. 50తన సుదీర్ఘ రాజకీయ అనుభవం లో ఎన్నడూ ఇలాంటి సంక్షేమ పాలనను నేను చూడలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లంక నిర్మల ఎంపీడీవో మురళీమోహన్ తహసిల్దార్ విశ్వనాథ రావు మండల పరిషత్ ఉపాధ్యక్షులు పుచ్చకాయల సుబ్బారెడ్డి మండల వైసిపి అధ్యక్షులు మిద్దే బాలకృష్ణ మండల నాయకులు దామెర ప్రసాద్ బాబు మండలంలోని సర్పంచులు ఎంపీటీసీలు వైసిపి నాయకులు వివిధ పథకాల లబ్ధిదారుల పెద్ద ఎత్తున తరలివచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img