Monday, June 5, 2023
Monday, June 5, 2023

డ్రైనేజీ పనులను త్వరగా పూర్తి చేయాలి

విశాలాంధ్ర – కొయ్యలగూడెం : డ్రైనేజీ పనులను వేగవంతం చేయాలని టిడిపి మండల అధ్యక్షుడు పారేపల్లి నరేష్ తెలిపారు. జీలుగుమిల్లి నుండి దేవరపల్లి వరకు నూతనంగా నిర్మిస్తున్న 516 వ జాతీయ రహదారి నిర్మాణం కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా రొడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ నిర్మించడానికి ప్రోక్లైన్లతో త్రవ్వి మధ్యలోనే పనులు నిలిపివేయడంతో వర్షపు నీరు నిల్వ ఉండడం వలన చెత్త పేరుకుపోయి అపరిశుభ్రంగా ఉందని వెంటనే సంబంధిత అధికారులు రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. బయ్యనగూడెం గ్రామంలో ప్రధాన రహదారి అసలే ఇరుకుగా ఉండడంతో జాతీయ రహదారి నిర్మిస్తున్నారని, రహదారి విస్తరణ జరిగితే, ప్రమాదాలు జరగకుండా ఉంటాయననారు. రోడ్డు కూడా వెడల్పు వస్తుందని ఆశపడ్డ తమకు , నూతనంగా నిర్మిస్తున్న రహదారి పనులు పూర్తి చేయకుండా మధ్యలోనే నిలిపివేయడంతో పలు ప్రమాదాలకు కూడా ద్విచక్ర వాహనాల వారు, పాదచారులు, గురవుతున్నారన్నారు. సంబంధిత అధికారులు డ్రైనేజీ నిర్మాణం వేగవంతం చేయాలని నరేష్ కోరారు. నరేష్ వెంట కే దాసు సూరి చంద్రం,ఆణెం నాగేంద్ర , సింహాద్రి వెంకన్న బాబు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img