Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

విద్యుత్ సమస్యలను పరిష్కరించాలి

విశాలాంధ్ర – జంగారెడ్డిగూడెం : సుదీర్ఘ కాలంగా స్థానిక 6,7,8,9 వార్డులలో ఉన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు (అంజి) శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.ఈ నెల 16 వ తేదీ నుండి వరుసగా మూడు రోజుల పాటు 6,7,8,9 వార్డులలో రాత్రింబవళ్ళు విద్యుత్ లేక చంటి బిడ్డలు,గర్భిణీ స్త్రీలు,వృద్ధులు,మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు.గత 20 నుండి 30 సంవత్సరాలుగా ఉన్న పాత విద్యుత్ లైన్ లు ,ట్రాన్స్ ఫార్మర్,స్తంభాలు మార్చక పోవడం వల్ల ప్రతీ వేసవి కాలంలో లోఓల్టేజ్ సమస్యతో ఎస్ సి పేట,జగజ్జీవన్ రామ్ నగర్,ముస్లీం పేట, లయోల స్కూల్ రోడ్,9 వ వార్డు కు చెందిన సాయి బాలాజీ టౌన్ షిప్ లోని రెండు రోడ్ లు ఇలా నాలుగు వార్డుల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత మూడు రోజుల క్రితం వేరే ట్రాన్స్ఫార్మర్ లు వేసినా తమ సమస్య పరిష్కారం కాకుండా అలానే ఉందన్నారు. ఎస్సీ పేటలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ల నుండి వచ్చే లైన్ లో ఒకే ఒక్క సింగిల్ ఫేస్ వైర్ ఉండటం వల్ల అందరూ ఆ ఒక్క సింగిల్ ఫేస్ నే వాడటం వల్ల లోడ్ ఎక్కువై మాటి మాటికి ట్రాన్స్ఫార్మర్ వద్ద సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.
ఆ విషయం అధికారులకు తెలిసినా కూడా ఇంకా ఆలస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రతీ సంవత్సరం విద్యుత్ శాఖాధికారులు తమ ఎస్సీ వార్డులలో విద్యుత్ సమస్య ను పరిష్కారం చేయకుండా అశ్రద్ద చేస్తున్నారని ధ్వజమెత్తారు.
విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి తమ వార్డుల్లో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని , తమ వార్డుల్లో ఉన్న పాత విద్యుత్ లైన్ లు పూర్తిగా మార్చి వాటి స్థానంలో కొత్త విద్యుత్ లైన్ లు వేయాలని,5 లైన్ ల అల్యూమినియం తీగలను వేయాలని,ఇప్పుడున్న ఒక ఫేసు,ఒక న్యుటర్ స్థానంలో మూడు ఫేస్ ల సదుపాయం కల్పించాలని, పాత స్థంబాల స్థానంలో కొత్త స్తంభాలు వేయాలని,విద్యుత్ ను అధికంగా వాడే ఐస్ క్రీమ్ వ్యాపారస్తుడి ఇంటి వద్ద 16 కెవి ట్రాన్స్ఫార్మర్ వేయించాలని మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు (అంజి)6 వ వార్డు కౌన్సిలర్ నేకూరి కిషోర్,7 వ వార్డు కౌన్సిలర్ దిరిసిపాము ధన లక్ష్మి, 9వ వార్డు కౌన్సిలర్ సంకు సురేష్ అధికారులను కోరారు. సమస్య పరిష్కరించని పక్షంలో ఈ విషయాన్ని ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు,ఎమ్మెల్యే వి.ఆర్.ఎలిజా దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img