Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎంపీడీవో తనిఖీలో నిగ్గుతేలిన నిజాలు

విద్యా శాఖలో ఇష్టారాజ్యం
ఆడిందే ఆట పాడిందేపాట

చాట్రాయి: విద్యాశాఖలో ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఆడిందే ఆటగా పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారో ఎంపీడీవో తనిఖీలో నిజాలు నిగ్గు తేలయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మంగళవారం ఎంపీడీవో ఎన్. మురళీమోహన్ చనుబండ పంచాయతీ సూరంపాలెం ఎస్ సి కాలనీలోని మండల పరిషత్తు పాఠశాలలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో ఉండవలసిన ఉపాధ్యాయుని స్థానంలో మహిళ ఉండడంతో ఎంపిడిఓ ఆశ్చర్యపోయారు. ఫోన్ చేస్తే కొంత సేపటికి టీచర్ వచ్చారు.పిల్లల హజరుపట్టీ అడిగితే వేరే రూంలో వుందని తాళం చెవ్వి పోయిందని పొంతన లేని సమాధానాలు చెప్పారు. మధ్యాహ్న బోజనం వండడం లేదనే విషయం తనిఖీలో తేలింది. మొత్తం పిల్లలు 35 అంటున్న కొద్ది మంది మాత్రమేఎందుకు వున్నారని ఎంపిడిఓ ప్రశ్నించారు. టీచర్ ను డిప్యూటేషన్ పై ఇక్కడ మండల విద్యాశాఖాధికారి వేసారని తెలుపగా ఎంఇఓ ఆర్డర్ కాపీలు చూపించని కనీసం వాట్సప్ లో పంపమని ఆదేశించినా గంటలు గడచిన ఇప్పటీకీ అతీగతిలేదని ఎంపిడిఓ అంటున్నారు. ప్రభుత్వ బడులలో విద్యాబిఅభివృద్ధి కోసం తామేదో చేస్తున్నామని ప్రభుత్వం ఎంత గొప్పలు చెప్పుకున్న చాట్రాయి మండలం లో మాత్రం పేద దళితుల పిల్లల విద్య పట్ల మాత్రం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారోమరోసారి బట్టబయలైంది. గత కొన్ని సంవత్సరాల నుండి చాట్రాయి మండలం లో ప్రభుత్వ విద్యా శాఖలో అదికారుల చేతివాటం వలన ముడుపులు చెల్లించాల్సిన వారికి చెలిస్తే ఉపాధ్యాయులు పాఠశాలకు వెళ్లకపోయినా పుష్కలంగా జీతాలు మార్చుకునే వారని నానుడి వుండేదని అది మరోసారి రుజువైందని పలువురు అంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img