Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

గుండెపోటుతో గణపవరం తహసిల్దార్ మృతి

మృతికి పలువురి సంతాపం

గణపవరం: గణపవరం తహసిల్దార్ బొడ్డు శ్రీనివాసరావు( 60) గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు. వారు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి నాలుగు రోజుల క్రితం వైరల్ ఫీవర్ రావడంతో తణుకులో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లినట్లు తెలిపారు. సోమవారం రాత్రి గుండె పోటు రావడంతో గం.9 సమయంలో మృతి చెందినట్లు తెలిపారు. తహసిల్దార్ స్వగ్రామం అత్తిలి గ్రామం ఆయనకు భార్య,3గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

పలువురు సంతాపం…

తహసిల్దార్ బొడ్డు శ్రీనివాసరావు మృతికి తీరని లోటు అని ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు), రుద్దరాజు ఫౌండేషన్ చైర్మన్ ఆర్ వి ఎస్ రాజు, గణపవరం ఎంపీపీ దండు వెంకటరామరాజు (అర్థవరం రాము) జడ్పిటిసి సభ్యులు దేవరపు సోమలక్ష్మి ,
గణపవరం సర్పంచ్ మూర అలంకారం, ఎంపీడీవో గద్దల జ్యోతిర్మయి, డిప్యూటీ తహసిల్దార్ ఎం సన్యాసిరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏ ఈ హరినాథ్ రాజు సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img