Saturday, October 1, 2022
Saturday, October 1, 2022

కరాటేలో శ్రీచైతన్య విద్యార్థులకు బంగారు పతకాలు

ఏలూరు: స్థానిక సి ఆర్ .రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో, తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్ రాష్ట్ర కరాటే పోటీలు శని, ఆదివారాలలో నిర్వహించబడ్డాయని శ్రీ శ్రీ చైతన్య పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శివకుమారి తెలిపారు. చత్తీస్ ఘడ్, ఒరిస్సా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుండి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సుమారు 46 టీములు, 600 మంది క్రీడాకారులు పాల్గొన్నారన్నారు. తమ పాఠశాల విద్యార్థులు ఏ.యశస్విని(9 వ తరగతి) కుమితే విభాగంలో బంగారు పతకాన్ని, ‘కట్టా’ విభాగంలో రజిత పతకాన్ని, ఏ. కావ్య శ్రీ (8వ తరగతి)” కుమ్తే” “కట్టా “విభా గాలలలో ప్రథమ స్థానంలో నిలిచి రెండు బంగారు పతకాలను, ‘కట్టా’ విభాగంలో ఎం ధనుష్ (9 వ తరగతి), ఎం. జూహిత్ రామ్(9 వ తరగతి), బి. సహస్ర(5వ తరగతి), జి. అభిరామ్(5వ తరగతి), ఎం. షణ్ముఖ కృష్ణ (5వ తరగతి) రజిత పతకాలతో పాటు, ప్రశంసా పత్రాలను పొంది తమ సత్తాను చాటారని తెలిపారు. ఈ సందర్భంగా శ్రీచైతన్య విద్యాసంస్థల రీజినల్ ఇంచార్జ్ పార్థసారథి, అకడమిక్ జోనల్ కోఆర్డినేటర్ సిహెచ్ ఉదయభాస్కర్, ఎకడమిక్ డీన్ రఘు శేషుబాబు, ప్రైమరీ ఇంచార్జ్ నరీనా ఇంతటి ఘన విజయానికి కారకులైన కరాటే మాస్టర్ శ్రీనివాసును, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img