Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దొంగ పిండి గ్రామ అభివృద్ధికి నిధులు మంజూరు

ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

భీమవరం టౌన్ : దొంగ పిండి గ్రామ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఇందులో భాగంగానే ఇటీవల ఆ గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. తాను గ్రామంలో ఇంటింటికి తిరుగుతున్న సమయంలో ప్రజలు కోరిన మేరకు రూ. 22 లక్షల 50 వేల నిధులతో పలు అభివృద్ధి పనులు చేయడానికి గాను నిధులు మంజూరుకు ప్రతిపాదనల ను ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. నాలుగైదు రోజుల్లో నిధులు మంజూరు అవుతాయని తెలిపారు. ఈ మేరకు గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్ అధికారులతో ఆయన మాట్లాడారు .అనంతరం ఆయన మాట్లాడుతూ దొంగపిండి గ్రామంలో బొడ్డు హరిశ్చంద్రుడు ఫిష్ ట్యాంక్ నుండి బొడ్డు వడ్డీ కాసులు ఇంటివరకు రోడ్డుకు రూ.3 లక్షలు, ఆర్ అండ్ బి రోడ్డు నుండి జిల్లా పరిషత్ హై స్కూల్ వరకు రోడ్డుకు రూ.4 లక్షల 50 వేలు , రేవు వాసుదేవుడు ఇంటి నుండి బొమ్మిడి స్వామి ఇంతవరకు సిసి రోడ్డు, డ్రై న్ కు రూ.5 లక్షలు, కమి శ్రీను ఇంటి వద్ద నుండి ఆంజనేయ స్వామి గుడి వరకు రోడ్డుకు రూ 5 లక్షలు జి.ఎస్. బి నుండి ఆంజనేయ స్వామి గుడి వరకు ఐదు లక్షలు నిధులను మంజూరు చేసేందుకు ప్రతిపాదనలను పంపడం జరిగిందన్నారు. ఈ పనులకు సంబంధించి గడపగడపకు మన ప్రభుత్వం నిధులు, ముఖ్యమంత్రి అభివృద్ధి పథక నిధులు ఖర్చు చేస్తామన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ డిఇ స్వామి నాయుడు, జేఈ వై శ్రీనివాసులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img