Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

చలసాని కృషి అనిర్వచనీయం….!

డైరెక్టర్ బొట్టు రామచంద్రరావు..

విశాలాంధ్ర – చాట్రాయి: కృష్ణా మిల్క్ యూనియన్ చరిత్రలో పాడి రైతులను ప్రోత్సహించడంలో చలసాని ఆంజనేయులు కృషి చరిత్రలో మరువలేనిదని కృష్ణ మిల్క్ యూనియన్ డైరెక్టర్ బొట్టు రామచంద్రరావు కొనియాడారు. బుధవారం చాట్రాయి మండలంలోని పలు గ్రామాలలో కృష్ణ మిల్క్యున్ యూనియన్ పాల సంఘాల వద్ద చైర్మన్ చలసాని ఆంజనేయులు సందర్శించారు. గడచిన నాలుగు సంవత్సరాలుగా చలసాని ఆధ్వర్యంలో పాడి రైతులకు ప్రోత్సాహాలిస్తున్నందుకుగాను కృతజ్ఞతతో వారు చలసాని ఆంజనేయులు కు చిరు సత్కారం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో డైరెక్టర్ బొట్టు రామచంద్రరావు మాట్లాడుతూ పాడి పరిశ్రమ ద్వారా రైతు ఆర్థిక అభివృద్ధికి కృష్ణ మిల్క్ యూనియన్ కు ఒక చరిత్ర ఉంటే గడచిన నాలుగేళ్ల క్రితం చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఆంజనేయులు విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. యావత్ భారతదేశం లోనే ఎక్కడో లేనివిధంగా చిన్న నాలుగేళ్ల కాలంలో లీటరు పాల ధర రూ.25కి పెంచిన ఘనత చలసానిదే అన్నారు.1,80,000 లీటర్ల నుండి 3 లక్షల లీటర్లకు పాల సేకరణ పెంచడం జరిగిందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా చలసాని నాయకత్వంలో పాడి రైతుల కుటుంబాలలో పెళ్లి జరిగితే కళ్యాణమస్తు , మరణం సంభవిస్తే క్షీరబందు పథకాల ద్వారా కొత్తదనానికి శ్రీకారం చుట్టారన్నారు. రైతులు కౌలు రైతులు నిరుద్యోగ యువత పాడి పరిశ్రమను ఉపాధి పథకంగా ఎంచుకునే విధంగా తయారు చేయడం గర్వకారణం అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ నెక్కలపు వాణిశ్రీ, ట్రస్ట్ డైరెక్టర్ ముక్కాల విజయలక్ష్మి కృష్ణ మిల్క్ యూనియన్ సిబ్బంది పాల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img