Thursday, June 8, 2023
Thursday, June 8, 2023

హోప్ మినిస్ట్రీస్ సంస్థ ద్వారా గత 8 సంవత్సరాలుగా 7 వేల కుట్టు మిషన్లు పంపిణీ…

విశాలాంధ్ర,జంగారెడ్డిగూడెం: హోప్ మినిస్ట్రీస్ సంస్థ ద్వారా పేద,మధ్య తరగతి మహిళల అభివృద్ధికి, కుటుంబ పోషణకు ఆదాయాన్ని సమకూర్చుకునేలా కుట్టు మిషన్లు పంపిణీ చేయడం అభినందనీయమని చింతలపూడి శాసన సభ్యులు ఉన్నమట్ల ఎలీజా అన్నారు. బుధవారం స్థానిక చిట్టూరి గణేశ్వరరావు టౌన్ హాల్ నందు మెగా కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చింతలపూడి శాసనసభ్యులు వీ.ఆర్.ఎలీజా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
స్వచ్ఛంద సంస్థల ద్వారా తాత్కాలికంగా ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారని,అలా కాకుండా హోప్ మినిస్ట్రీస్ సంస్థ ద్వారా ప్రతీ కుటుంబానికి ఉపయోగపడే విధంగా ,ప్రతి ఒక మహిళ తన కాళ్లమీద తాను నిలబడే అవకాశం కల్పించడం పట్ల హోప్ మినిస్ట్రీస్ డైరెక్టర్ జాషువా ను ఎమ్మెల్యే అభినందించారు.కుట్టు మిషన్లు తీసుకున్న ప్రతీ మహిళ కష్టపడి పనిచేసి కుటుంబానికి ఆసరాగా ఉండాలని తెలియజేశారు. అనంతరం హోప్ మినిస్ట్రీస్ డైరెక్టర్ జాషువా గెడ్డం మాట్లాడుతూ 2015వ సంవత్సరం నుండి ఇప్పటివరకు హోప్ మినిస్ట్రీస్ సంస్థ ద్వారా 7 వేల కుట్టుమిషన్లను పేద మహిళలకు పంపిణీ చేసినట్లు జాషువా తెలిపారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లలో మూడు కుట్టు మిషన్ల శిక్షణా కేంద్రాలు తమ సంస్థ ద్వారా నిరంతరం నడుస్తున్నాయని ప్రతి మూడు నెలలకు ఒకసారి శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.అందులో భాగంగా పట్టణంలో శిక్షణ పొందిన 100మంది మహిళలకు బుధవారం కుట్టు మిషన్లు పంపిణీ చేసినట్లు చెప్పారు.
ఎమ్మెల్యే ఎలీజా చేతుల మీదుగా మహిళలకు కుట్టు మిషన్ లను పంపిణీ చేశారు.అనంతరం ఎమ్మెల్యే ఎలిజా ను జాషువా గెడ్డం ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బత్తిన లక్ష్మి, జెడ్పిటిసి పోల్నాటి బాబ్జి ,వైసీపీ సీనియర్ నాయకులు,మాజీ సర్పంచ్ మండవల్లి విజయ సారథి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయి బాల పద్మ, మున్సిపల్ వైస్ చైర్మన్ లు ముప్పిడి అంజి,కంచర్ల వాసవీ రత్నం,మండల వైసీపీ అధ్యక్షుడు వామిశెట్టి హరిబాబు పట్టణ వైసిపి అధ్యక్షుడు పిపిఎన్ చంద్ర రావు,వైసీపీ నాయకుడు బత్తిన చిన్నా,కౌన్సిలర్ లు నంబూరి రామ చంద్ర రాజు, కాసర తులసి రెడ్డి, ఉగ్గం ప్రసాద్, టి.వి. ఎ.మురళి,శ్రీనివాసపురం ఉప సర్పంచ్ పోల్నాటి శ్రీనివాసరావు,ఎంపీటీసీ కొయ్య రమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img