Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

చిరుధాన్యాల పరిశోధనా సంస్థతో హార్టీకల్చరల్ యూనివర్శిటీ ఒప్పందం

విశాలాంధ్ర – తాడేపల్లిగూడెం రూరల్ :భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి పరిధిలోని చిరుధాన్యాల పరిశోధనా సంస్థతో డాక్టర్ వై.యస్.ఆర్. హార్టీకల్చరల్ యూనివర్శిటీ అవగాహన ఒప్పందం చేసుకుందని యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ టి. జానకిరామ్ సోమవారం ప్రకటనలో తెలిపారు. 2023వ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరంగా భారత ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. దీనిలో భాగంగా చిరుధాన్యాల సాగులో వివిద రకాల సాగు, దిగుబడిలో వచ్చే రకాలు అందుకు అవసరమైన ఉపకరణాలు, రైతులకు కావలసిన ప్రోత్సాహం, విద్యార్థులకు అవగాహన కల్పించడంపై కృషి చేస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగా ఈనెల 2వ తేదీన హైదరాబాద్లో జరిగిన భారతీయ వ్యవసాయ పరిశోధనామండలి సమావేశంలో చిరుధాన్యాల పరిశోధనా సంస్థతో యూనివర్శిటీ ఒప్పందం చేసుకుందని తెలిపారు. యూనివర్శిటీ తరపున రిజిస్ట్రార్ బి.శ్రీనివాసులు, చిరుధాన్యాల పరిశోధనా సంస్థ తరపున సంచాలకులు సి. తారాసత్యవతి సంతకాలు చేసి ఒప్పంద పత్రాలు మార్చుకున్నారని ఆయన తెలిపారు. ఒప్పందం ప్రకారం చిరుధాన్యాలు పరిశోధనా ఫలితాలు ఈ రెండు సంస్ధలు సహకారం ఇచ్చిపుచ్చుకోవాలని తెలిపారు. అలాగే యూనివర్శిటీలోని యవిద్యార్థులకు చిరు ధాన్యాల వల్ల కలిగే ఉపయోగాలు, దిగుబడులు తదితర అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img