Monday, October 3, 2022
Monday, October 3, 2022

రోత భాషతో నికృష్ట పాలన ఎన్నాళ్ళు

టిడిపి జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవారెడ్డి

చాట్రాయి : రోత బాషతో నికృష్ట పాలన ఎన్నాళ్ళు సాగిస్తారని టిడిపి జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవ రెడ్డి మండిపడ్డారు. సోమవారం మండల కేంద్రం చాట్రాయి గ్రామంలో మాజీ మంత్రి కొడాలి నాని చంద్రబాబు , ఆయన సతీమణి భువనేశ్వరి పై విలేకర్ల సమావేశంలో అసభ్య పదజాలం వాడటానికి నిరసనగా చాట్రాయి సెంటర్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు టిడిపి మండల శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు.పోలీస్ స్టేషన్లో వినతి పత్రం అందజేశారు. పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మందపాటి మాట్లాడుతూ ప్రజాజీవితంలో ఉండి ప్రజలు అసహ్యించుకునే విధంగా మాట్లాడరని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతి ఒక్కరికి తల్లి, సోదరి, భార్య , వుంటారనేవిషయాన్ని మరువకూడదన్నారు . రాజకీయాలు ఏవైనా పార్టీలు వేరైనా సభ్య సమాజంలో తల ఎత్తుకునే విధంగా ఉండాలన్నారు. కొడాలినానిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు రైతు ఏలూరు జిల్లా ప్రదాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ పరిపాలనలో అన్ని విధాలుగా విఫలమైన వైసిపి ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించడానికి బూతు పురాణం అందుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులు బొట్టు రామచంద్రరావు మాట్లాడుతూ ఉన్నత స్థానాల్లో ఉన్న నాయకులు అంత రోతగా మాట్లాడుతూ ప్రవర్తిస్తుంటే భావితరాలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. మాజీ ఎంపీపీ కందుల కృష్ణ మాట్లాడుతూ రానున్న రోజుల్లో వీరికి సరైన గుణపాఠం చెప్పడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి టిడిపి మండల అధ్యక్షులు
మరిడిచిట్టిబాబు అధ్యక్షత వహించగా సీనియర్ నాయకులు పుచ్చకాయల నోబుల్ రెడ్డి, చాట్రాయి మాజీ సర్పంచ్ జోషి, మర్లపాలెం ఉపసర్పంచ్ వెల్దిరాజా, కంచర్ల హనుమంతరావు, పరసాశ్రీను, గుదిమళ్ళ బ్రహ్మయ్య, రత్తయ్య, పానుగళ్ళ కోటేశ్వరరావు, తెలుగు మహిళా నియోజకవర్గ నాయకురాలు మాదాసు చంద్ర కళ, ఊట్లధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img