Monday, August 8, 2022
Monday, August 8, 2022

బెదిరింపులకు భయపడను

రాష్ట్రం మరో శ్రీలంక
టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు

పాలకొల్లు : వైసిపి ప్రభుత్వం ప్రతిపక్షంపై ఎదురుదాడి చేయడమే పనిగా పెట్టుకుందని బెదిరింపులకు టిడిపి భయపడే ప్రసక్తే లేదని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం యలమంచిలి వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబు నాయుడు, ముంపు బాధితుల పరామర్శల పర్వం అనంతరం పాలకొల్లు రామచంద్ర గార్డెన్స్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వరద బాధితుల పరిస్థితి ఘోరంగా ఉందన్నారు. ప్రభుత్వం కనీసం పాలు, పప్పులు లాంటి నిత్యవసరాలను సైతం అందించలేకపోవడం దారుణం అన్నారు. ప్రభుత్వం వారికి కేవలం రూ.2వేలు తక్షణసాయంగా అందించడం సరికాదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రూ.10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వరద బాధితులను పట్టించుకున్న పాపాన పోలేదని, అసలు వరద బాధితులకు ప్రభుత్వం ఏం చేయదలుచుకుందో చెప్పాలంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. వరద బాధిత కుటుంబానికి ఒక్క కుటుంబానికి రూ .10 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని, మృతి చెందిన కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారంగా ఇవ్వాలని, పశువులు మరణిస్తే 40వేలు, మట్టి ఖర్చులకు 30వేలు,ఇవ్వాలంటూ ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పశువుల షెడ్డు కు రూ.1 లక్ష 50 వేలు చెల్లించాలన్నారు. అయోధ్య లంక గ్రామానికి వెళ్ళేందుకు కనీసం దారి కూడా లేదని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని తక్షణమే అయోధ్య లంక బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు. వరద బాధితులకు పరిహారం చెల్లించని పక్షంలో తెలుగుదేశం పార్టీ పేదల పక్షాన వరద బాధితుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు. జగన్ ప్రభుత్వం ఓట్ల కోసం ఓదార్పు యాత్ర, పాదయాత్ర చేసి ప్రజలను మోసం చేసిందన్నారు. ఆంధ్రప్రదేశ్ ను మరో శ్రీలంక మారుస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టిడ్కో ఇళ్ల గురించి ప్రస్తావిస్తూ టిడ్కో ఇళ్ల గురించి తలుచుకుంటేనే మనసుకు బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యతా పరంగా అత్యధిక సాంకేతికతో నివాసయోగ్యంగా నిర్మిస్తే ఈనాటికీ ప్రభుత్వం వాటిని పేదలకు ఇవ్వక పోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పడవ ప్రమాదంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఈ విషయంలో పోలీసులు కూడా బాధ్యతారహితంగా ప్రవర్తించారన్నారు. తన హయాంలో పోలీసులు వ్యవస్థ అత్యంత ప్రతిష్టంగా ఉండేదన్నారు.కొంతమంది పోలీసులు అత్యుత్సాహంతో తమ ఆపేందుకు ప్రయత్నించారన్నారు. పడవ ప్రమాదంపై వైసీపీ నేతలు చేసిన ట్వీట్ పై తాను వాళ్ళలా చులకనగా మాట్లాడబోననీ, చవక బారు ఆరోపణలు చేయడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే పీతల సుజాత, మాజీ హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి జోహార్, తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ, కొక్కిరిగడ్డ్డ జయరాజు పలువురు టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img