Wednesday, October 5, 2022
Wednesday, October 5, 2022

పాలకొల్లు మున్సిపాలిటీ ఏర్పడి వందేళ్లు

నవంబర్ 3,4 తేదీలలో వందేళ్ల పండుగకు సన్నాహాలు
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాబ్జి

పాలకొల్లు: పాలకొల్లు మున్సిపాలిటీ ఏర్పడి వంద సంవత్సరాలు దాటిపోయిందని, ఈ సందర్భంగా వంద సంవత్సరాల పండుగను అత్యంత ఘనంగా, భావితరాలకు పాలకొల్లు చరిత్ర కలకాలం గుర్తుండేలా నిర్వహించనున్నామని మాజీ ఎమ్మెల్యే వైద్యరత్న డాక్టర్ సిహెచ్ సత్యనారాయణ మూర్తి అన్నారు. ఆయన నివాసంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ బాబ్జి మాట్లాడుతూ పాలకొల్లు మున్సిపాలిటీ ఏర్పడి నూరు సంవత్సరాలు పైబడిన సందర్భంగా పట్టణములో అందరూ భాగస్వాములై నవంబర్ నెలలో 3,4 తారీకుల్లో నూరు వసంతాల పండుగను అత్యంత ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. పాలకొల్లు పట్టణ ప్రజలందరూ భాగస్వాములు కావాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సిహెచ్ సత్యనారాయణ మూర్తి కోరారు. పాలకొల్లు నుండి అనేకమంది ఉన్నతమైన స్థానాలలో ఉన్నారని, అనేకమంది ప్రముఖులను ఆహ్వానిస్తున్నామని, పట్టణాన్ని కన్నతల్లి లాభావించి సంక్రాంతి పండుగ ను తలపించేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ 100 సంవత్సరాల పండుగ నిర్వహణలో భాగస్వాములు కావాలని, సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రముఖులైన అనేకమంది రాజకీయ సాంస్కృతిక ప్రముఖుల అందరిని ఆహ్వానించనున్నట్లు డాక్టర్ బాబ్జి వెల్లడించారు ఇప్పటివరకు రూ.10 లక్షల ఫండింగ్ వచ్చిందని సుమారు రూ.30 నుండి40 లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయుడు వంగా నరసింహారావు రేపాక ప్రవీణ్ భాను తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img