Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

పదవులు కాదు ముఖ్యం – పార్టీ గెలుపే లక్ష్యం

ఎన్ఆర్ఐ బొట్టు వంశీ

చాట్రాయి:
ప్రతి సామాన్య కార్యకర్తకు అండదండగా ఉంటానని టిడిపి గెలుపే లక్ష్యంగా తాను పని చేస్తున్నానని ఎన్నారై బొట్టు వంశీ తెలిపారు. అమెరికాలో 15 రాష్ట్రాలలో మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు తో కలిసి టిడిపి అభివృద్ధి కోసం ఎన్నారైల సహకారం కోరుతూ సభలు నిర్వహిస్తున్న బొట్టు వంశీ విశాలాంధ్ర తో మాట్లాడుతూ తన తండ్రి దివంగత నేత బొట్టు విజయ్ చౌదరి తెలుగుదేశం పార్టీ చాట్రాయి మండల అధ్యక్ష బాధ్యతలలో ఉండగా కరోనా కాలంలో మృతి చెందారన్నారు.గ్రూప్ వివాదాలతో చిన్నాభిన్నమైన టిడిపిని మండలంలో ఏకతాటి పైకి తీసుకురావడానికి,సమన్వయం చేయడానికి అహర్నిశలు కృషి చేశారని గుర్తు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో కూడా ఆర్థిక సహాయ సహకారాలు అందించామన్నారు. దురదృష్టవశాత్తు ఆయన మరణించారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం తాను చాట్రాయి మండలం లో తెలుగుదేశం పార్టీని అతిపెద్ద రాజకీయ శక్తిగా తయారు చేయడానికి తన బాధ్యత గా ప్రయత్నం చేస్తున్నానిఅన్నారు. పదవులు తనకు ముఖ్యం కాదని పార్టీ గెలుపే తన లక్ష్యమన్నారు. పార్టీలో చురుకైన యువకులకు రాజకీయ చైతన్యం నింపి వారికి బాధ్యతలు అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. యువరక్తాన్ని ప్రోత్సహించాలన్నారు. అత్యధిక శాతం గా ఉన్నా దళిత బడుగు బలహీన వర్గాల కార్యకర్తలను నాయకులను అగ్రభాగాన పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. టిడిపిని రాబోయే తరాల వారికి గొప్ప రాజకీయ పార్టీగా అందించాల్సిన అవసరం నేటి తరంపై ఉందన్నారు. పార్టీ అంటే కేవలం ఎన్నికల కోసం పనిచేసే సంస్థ కాదన్నారు. శాశ్వత ప్రాతిపదికన ప్రజాసమస్యల పరిష్కారం కోసం నిరంతరం పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. మండలంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ తెప్పించి పార్టీ అధినేత చంద్రబాబుకు చూపించాలనే ధ్యేయంతో పనిచేస్తున్నాని తెలిపారు. అమెరికాలో ఉన్నా, చాట్రాయి లో ఉన్నా టిడిపి పురోభివృద్ధి తన ధ్యేయమన్నారు. విజయ్ చౌదరి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాను చేసేదే చెబుతానని చెప్పిందే చేస్తాననిఅన్నారు. తన వంతు సహాయ సహకారాలను అందించడంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ప్రతి సామాన్య కార్యకర్త ధైర్యంగా పార్టీ కోసం పనిచేయడానికి ఎమి అవసరమైన అన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాననితెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img