Saturday, October 1, 2022
Saturday, October 1, 2022

ఇంటింటికి కుళాయి పథకానికి జడ్ పి చైర్మన్ శంకుస్థాపన

పోడూరు: మండలం లోని జిన్నూరులో మంచినీటి చెరువు వద్ద రూ.22 లక్షల వ్యయంతో చేపడుతున్న ఇంటింటికి కుళాయి పథకానికి జడ్ పి చైర్మన్, పాలకొల్లు నియోజకవర్గం ఇన్ చార్జ్ కవురు శ్రీనివాస్ బుధవారం శంఖుస్థాపన చేశారు. అనంతరం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో పాల్గొన్నారు. కుళాయి చెర్వు వీధి మెయిన్ రోడ్ భూపయ్యచెర్వు ప్రాంతాలలో ఇంటింటికీ వెళ్లిన జడ్ పి చైర్మన్ కవురు శ్రీనివాస్ మహిళలకు ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. మూడేళ్లలో ఒక్కో కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరిందో ఆయన తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ గుంటూరి పెద్దిరాజు,ఎంపీపీ సబ్బీతి సుమంగళి, మండల ఇంచార్జి కలిదిండి గణపతిరాజు గ్రామ సర్పంచ్ జమ్ము బేబీ మహాలక్ష్మి, సొసైటీ చైర్మన్ డిటిడిసి బాబు, గ్రామ కమిటీ అధ్యక్షుడు భూపతి రాజు సూర్పారాజు, సొసైటీ డైరెక్టర్ గొగుల మండ విజయ దేవి, మీసాల నరసింహస్వామి, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ పెదపాటి పెద్దిరాజు, వైస్ ఎంపీపీ లు, గుబ్బల సత్యనారాయణ, ఇందుకూరి సీతారామరాజు, ఏఎంసి డైరెక్టర్ జమ్ము మృత్యుంజయరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img