Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పాత్రికేయులు వృత్తిగౌరవాన్ని పెంపొందించుకోవాలి

ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు సోమసుందర్

జంగారెడ్డిగూడెం: పాత్రికేయులు వృత్తి గౌరవాన్ని పెంపొందించుకోవాలని,
హక్కులకోసం, సంక్షేమం కోసం ఐక్యంగా పోరాడాలని ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు డి.సోమసుందర్ పిలుపునిచ్చారు.
ఏపియుడబ్ల్యు జె సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఐజెయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు వాసా సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ
ప్రజాస్వామ్యంలో నాలుగోస్తంభం అంటూ మీడియాను అందరూ కీర్తిస్తున్నప్పటికీ, పాత్రికేయుల స్థితిగతులు మాత్రం అధ్వాన్నంగా ఉన్నాయని సోమసుందర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాత్రికేయుల పని పరిస్తితులను, వృత్తి ప్రమాణాలను మెరుగు పరచడానికి, పాత్రికేయులకు భద్రత కల్పించడానికి, వారికి సరైనవేతనాలు, ఆరోగ్యభద్రత, సాధించడానికి ఏపియుడబ్ల్యుజెగత 65 సంవత్సరాలుగా అలుపెరుగని పోరాటాలు సాగించిందని సోమసుందర్ గుర్తు చేశారు. అనేక విజయాలు కూడా సాధించిందని పేర్కొన్నారు.
ఇంకా అనేక సమస్యలు పాత్రికేయులను వేధిస్తున్నాయని,
పాత్రికేయుల అపరిష్కృత సమస్యలపై త్వరలో చలో విజయవాడ కార్యక్రమం చేపట్టనున్నట్లు సోమసుందర్ తెలిపారు. యూనియన్ బలోపేతం చేయాలని పాత్రికేయులను ఆయన కోరారు. ఏపియుడబ్ల్యుజె రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే. మాణిక్యరావు మాట్లాడుతూ జర్నలిస్టులు ఐక్యంగా సమస్యల పరిష్కారానికి పోరాడాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సంక్షేమానికి యూనియన్ కట్టుబడి ఉందని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నాయకులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని చెప్పారు. యూనియన్ తరపున ప్రతి సభ్యునికి గుర్తింపు కార్డు ఇవ్వటానికి ప్రయత్నిస్తామని అన్నారు. పోలవరం, చింతలపూడి నియోజకవర్గాల స్థాయిలో జరిగిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా సభ్యత్వ నమోదు కమిటీ సభ్యులు డివి భాస్కరరావు, షేక్ ఆజాద్, ఎం. సాయిబాబా, ఏపియూడబ్ల్యూజె జిల్లా నాయకులు డీవీఎల్ఎన్ స్వామి, కటారి సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img