Wednesday, October 5, 2022
Wednesday, October 5, 2022

కోపల్లె సహకార బ్యాంకు అధ్యక్షుడిగా కృష్ణంరాజు

కాళ్ళ : కోపల్లె సహకార బ్యాంకు త్రి సభ్య కమిటీ అధ్యక్షుడిగా వేగేశ్న జయరామ కృష్ణంరాజు అన్ని విధాలా అర్హుడని డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌ నరసింహరాజు అన్నారు. బుధవారం కోపల్లె విశాల సహకార పరపతి సంఘం త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పివిఎల్‌ నరసింహరాజు విచ్చేశారు. ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో రాణించాలంటే సొసైటీ ఛైర్మన్‌గా బాధ్యతాయుతంగా పనిచేసి అందరి మన్ననలు పొందాలన్నారు . రైతులతో మమేకమై వారికి సకాలంలో రుణాలు మంజూరు చేసి వాటిని తిరిగి వసూలు చేస్తేనే కో-ఆపరేటివ్‌ సొసైటీ అభివృద్ధి చెందుతుందన్నారు . వేగేశ్న జయ రామకృష్ణంరాజు పార్టీ ఆవిర్భావం నుంచి ఎంతో కష్టపడ్డారని, అటువంటి వ్యక్తిని సొసైటీ ఛ్క్కెర్మన్‌ గా నియమించామన్నారు. సొసైటీ ఛైర్మన్‌గా కొత్తగా బాధ్యతలు చేపట్టిన వేగేశ్న జయరామకృష్ణంరాజు మాట్లాడుతూ డిసిసిబి ఛైర్మన్‌ పివిఎల్‌ నరసింహంరాజు నరసింహరాజు చైర్మన్‌ పదవికి వన్నె తెచ్చేలా కృషి చేస్తానన్నారు . రైతులకు అందుబాటులో ఉండి సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కత్రియ కార్పొరేషన్‌ చైర్మన్‌ పాతపాటి సర్రాజు, త్రిసభ్య కమిటీ సభ్యులు ముంజేటి రామకృష్ణ, గోళ్ల వెంకట రాంబాబు, జిల్లా సర్పంచుల ఛాంబర్‌ మండల అధ్యక్షులు కొలుకులూరి ధర్మరాజు , జెడ్పిటిసి పచ్చిగోళ్ల సోమేశ్వరరావు,పెనుమత్స విశ్వనాథరాజు, క్షత్రియ సంఘం అధ్యక్షుడు గాదిరాజు సుబ్బరాజు, వైసిపి మండల అధ్యక్షుడు గణేశ్న రాంబాబు, పెనుమత్స దుర్గా ప్రసాద్‌ రాజు మాజీ చైర్మన్‌ వేగేశ్న రవిరాజు, సర్పంచులు గోళ్ళ వెంకట సత్యనారాయణ, తానింకి నాగరాజు, హరివర్మ పాల్గొని బ్యాంక్‌ చైర్మన్‌ వేగేశ్నజయరామకృష్ణంరాజును పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img