Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

నాయకపోడు కులానికి స్థానిక సంస్థలలో గుర్తింపు ఇవ్వాలి

చింతలపూడి: నాయకపోడు సమస్యలను పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని చింతలపూడి శాసనసభ్యులు ఉన్న మట్ల ఎలిజా అన్నారు. ఎర్రగుంటపల్లి గ్రామంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా నాయకపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొమరం భీమ్, మద్ది రామచందర్ విగ్రహాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ఉన్న మట్ల ఎలిజా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎర్రగుంటపల్లిలో ఏర్పాటు చేసిన కొమరం భీమ్, మద్ది రామచంద్ర విగ్రహాలను నాయకపోడు సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు అప్పిరెడ్డి నాగు అధ్యక్షతన శాసన సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకపోడు జెండాను స్థానిక శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా ఆవిష్కరించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలుతెలిపారు. ఆదివాసి హక్కుల కోసం కొమురం భీం అనేక పోరాటాలు చేశారన్నారు. నాయకుపోడు రాష్ట్ర అధ్యక్షుడు అప్పి రెడ్డి నాగు మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో నాయకపోడు జాతికి స్థానం కల్పించాలని కోరారు. ఐటీడీఏ పాలకమండలి లో సభ్యత్వం ఇవ్వాలని కోరారు. ఐటీడీఏ సేవలు ఈ ప్రాంతానికి కాకుండా మెట్ట ప్రాంతానికి కూడా అందించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలను స్థానిక శాసనసభ్యులు పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నాయకపోడు సేవ సంఘం ఆధ్వర్యంలో మరిన్ని ఉత్సవాలు జరుపుకోవటం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా నాయకుపోడు సేవా సంఘం ఆధ్వర్యంలో విద్యపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకపోడు గౌరవ అధ్యక్షులు రావుల శ్రీనివాసరావు ఆంధ్ర ప్రదేశ్ నాయకపోడు సంఘ గౌరవ అధ్యక్షులు కాసిన లక్ష్మీనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి వెలగం రాఘవరావు , జిల్లా గౌరవ అధ్యక్షులు మేడి రాములు ఏపీ నాయకపోడు ఉద్యోగ సంఘం నాయకులు అప్పిరెడ్డి రాము వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జగ్గవరపు జానకి రెడ్డి, ఎంపీటీసీ తులిమిల్లి విజయభాస్కర్, జడ్పిటిసిమోలుగుమాటి నీరజ, స్థానిక సర్పంచ్ తులిమిల్లి రాణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img