Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

గ్రామసర్పంచ్ ఇంటి ముందే ఇలా

పెనుమంట్ర: నెగ్గపూడి పంచాయతీ పరిధిలో గ్రామ సర్పంచ్ ఇంటి ముందే సిసి రహదారిపై డ్రైనేజీ నీరు నిలిచి అద్వానంగా మారింది. దీంతో అటువైపు రాకపోకలు చేసేవారు ఇబ్బంది పడుతున్నారు. డ్రైనేజీ లోని మురుకునీరు రహదారిపైకి చేరుతున్న నీరు క్రిందకు పోయే మార్గం లేకపోవడంతో సమస్యగా మారింది. స్థానిక పంచాయతీ వారు డ్రైనేజీల శుభ్రపరచడంలో నిర్లక్ష్యం వహించడంతో నీరు నిల్వ ఉండడంతో దోమల సమస్య, దుర్వాసన వస్తుంది. తరచుగా ఇదే పరిస్థితినెలకొనడంతో అధికారులు, నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img