Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

ప్రధాన రహదారులకు మహర్దశ

భీమవరం టౌన్ : భీమవరం నియోజకవర్గ పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న రహదారుల నిర్మాణాల పనులను వేగవంతం చేయడంతో పాటు తాజాగా మరికొన్ని మెయిన్ రోడ్ల నిర్మాణాలకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించినట్లు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆర్ అండ్ బి అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భీమవరం నుండి దొంగపిండి,గూ ట్లపాడు రేవు నుండి బర్రివాని పేట వరకు రోడ్డు నిర్మాణ నిమిత్తం రూ.35 కోట్లు, భీమవరం నుండి ఎల్ వి ఎన్ పురం రోడ్డు వయా కొమరాడ అనకోడేరు రోడ్డు నిర్మాణ నిమిత్తం రూ.25 కోట్లు, భీమవరం నుండి పిప్పర వరకు రోడ్డు నిర్మాణానికి రూ. 2 కోట్ల 80 లక్షలు, చిన అమిరం నుండి గొల్లవాని తిప్ప రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు, మొగల్తూరు -బేతపూడి రోడ్డుకు రూ.2 కోట్లు, శృంగ వృక్షం నుండి యమునా పల్లి వరకు రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్ల 20 లక్షల నిధులను మంజూరు చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించడం జరిగిందన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా రాజీపడటం లేదని స్పష్టం చేశారు.
రోడ్డు నిర్మాణం జరగాల్సిన రహదారులకు ప్రస్తుతం రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు రోడ్ల నిర్మాణ పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్ ఈ లోకేశ్వరరావు, డీఈలు రామరాజు, కిరణ్ కుమార్, జేఈ శ్రీనివాస్ లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img