Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

సిపిఐ పశ్చిమగోదావరి జిల్లా 26వ మహాసభలు విజయవంతం చేయండి

సిపిఐ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు

తాడేపల్లిగూడెం:సిపిఐ పశ్చిమగోదావరి 26 వ జిల్లా మహాసభలు సందర్భంగా ఆగస్టు 2 న భీమవరం పట్టణంలో జరుగనున్న ప్రజాప్రదర్శన, బహిరంగ సభ విజయవంతం చేయాలని సిపిఐ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. శుక్రవారం తాడేపల్లిగూడెం కపర్ధీ భవన్లో జరిగిన సీపీఐ తాడేపల్లిగూడెం ఏరియా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సమావేశానికి అల్లం రాము అధ్యక్షత వహించారు. భీమారావు మాట్లాడుతూ ప్రజాసమస్యలు పరిష్కారమే ధ్యేయంగా ఉద్యమిస్తున్న సీపీఐ జిల్లా 26 వ మహాసభలు ఆగస్టు 2,3,4 తేదీల్లో భీమవరంలో జరుగుతున్నాయన్నారు.మహాసభలు ప్రారంభం సందర్భంగా ఆగస్టు 2 న భీమవరం క్రొత్త బస్ స్టాండ్ నుంచి జరుగనున్న ప్రజాప్రదర్శన వీరమ్మ చెరువు పార్క్ వద్ద జరిగే బహిరంగ సభలో పార్టీ శ్రేణులు అధికసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.వ్యవసాయాధారమైన పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజలెదుర్కొంటున్న త్రాగునీరు, సాగునీరు సమస్య పరిష్కారానికి,కాలుష్య నివారణ, వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పనకు, తదితర సమస్యలు పరిష్కారానికి మహాసభలో పోరాట కార్యాచరణ రూపొందింస్తామన్నారు.మహాసభలు విజయవంతానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని భీమారావు కోరారు.సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.సీతారాం ప్రసాద్, జిల్లా కార్యవర్గ సభ్యుడు కలిశెట్టి వెంకట్రావు, జిల్లా సమితి సభ్యులు కళింగ లక్ష్మణరావు, సనపల శ్రీను, ఎం.లక్ష్మీపతి,మండల నాగేశ్వరరావు, బోణం ధనలక్ష్మి, తూము సత్యనారాయణ తదితరులు మాట్లాడారు.
అనంతరం సీపీఐ తాడేపల్లిగూడెం ఏరియా కన్వీనింగ్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీపీఐ తాడేపల్లిగూడెం ఏరియా సమితి కన్వీనర్ గా మండల నాగేశ్వరరావు, కన్వీనింగ్ కమిటీ సభ్యులుగా ఎం.శివ, తాటికొండ గంగాభవాని, అల్లం రాము, ఎం.వసంతకుమారి,ఉల్లింకల జయకృష్ణ, ఇందుకూరి సత్యనారాయణ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img