Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జ్వరాలు ప్రబల కుండా చర్యలు తీసుకోవాలి

చింతలపూడి: జ్వరాలు ప్రబలకుండా వైద్య ఆరోగ్య సిబ్బంది పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని డి ఎం హెచ్ ఓ డా. డి. రవికుమార్ ఆదేశించారు. శనివారం నాగిరెడ్డిగూడెం లో, ఎర్రగుంటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల డెంగ్యూ వ్యాధి నుండి కోలుకున్న
భూక్యా రమేష్ ని పరామర్శించారు. గ్రామంలోని పలు గృహాలు సందర్శించి వైద్య ఆరోగ్య సిబ్బంది చేపట్టిన చర్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డా. రవికుమార్ మాట్లాడుతూ డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు రాకుండా ఉండేందుకు ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లు లేకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఇంటి నివాసిత ప్రాంతాల్లో వుండే ఓవర్ హెడ్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్, ఫ్రిజ్, కూలర్ లలో నుండి ఈ డెంగ్యూ, మలేరియా వ్యాఫ్తి దోమలు ప్రభలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
వైద్య ఆరోగ్య శిబిరం లో యర్రగుంటపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు పి. మానస, కె. నరేష్, మలేరియా సబ్ యూనిట్ అధికారి నెరుసు వెంకట రామారావు, పిహెచ్ యన్ జి రమణ మ్మ, హెల్త్ అసిస్టెంట్ లు సయ్యద్ జఫ్రుల్లా, యం బాలరాజు, శ్రీనివాసరావు, ఏయన్ యం లు విజయనిర్మల, కె కుమారి, యంయల్ హెచ్ పి లు దిలీప్, సంపత్, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img