Monday, October 3, 2022
Monday, October 3, 2022

పంట చేలు ముంపుకు గురికాకుండా చర్యలు

ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

భీమవరం టౌన్:వర్షాకాలంలో వరి చేలు ముంపుకు గురికాకుండా ముందుగానే చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు .ఈ మేరకు నియోజకవర్గ పరిధిలో డ్రైన్లను ప్రక్షాళన చేస్తున్నామన్నారు. సుమారు రూ.40 లక్షలతో చేపట్టిన దేవరకోడు డ్రైన్ ప్రక్షాళన పనులను బుధవారం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పరిశీలించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట చేలలో నీరు నిలిచినప్పుడు ఆ నీటిని డ్రైన్ ల ద్వారా త్వరితగతిన మెయిన్ డ్రైన్ లోకి మళ్ళించడానికి అవకాశం ఉండే విధంగా ప్రతి డ్రైన్ని కూడా ప్రక్షాళన చేస్తున్నామన్నారు .దేవరకోడు డ్రైన్ కి సంబంధించి కమతాలపల్లి నుండి తుందుర్రు, వెంప మీదుగా గొంతేరు డ్రైన్ వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర ఈ డ్రైన్ ను ప్రక్షాళన చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పేరిచర్ల విజయ నరసింహారాజు, జడ్పిటిసి కాండ్రేగుల నరసింహ రావు, తాసిల్దార్ వై రవికుమార్, ఇన్చార్జ్ ఎంపీడీవో ఎస్ ఎస్ రామచంద్ర ప్రభు, సర్పంచులు ఆరెటి వీరస్వామి నాయుడు, కోళ్ల బాలకృష్ణ ,డ్రైన్ ఏఈ దుర్గారావు, కొట్టి కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img