Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆసరా పథకంతో మహిళలు ఆర్థికంగా బలోపేతం….

ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్…

విశాలాంధ్ర- పాలకొల్లు: ఆసరా పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉంచాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్ష అని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు.పాలకొల్లు నియోజకవర్గ వర్గం లోని పాలకొల్లు మండలం లోని గ్రామాల మహిళలకు ఆసరా మూడవ విడత నిధులు బుధవారం విడుదల చేస్తున్న సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో వంక రవీంద్ర పాల్గొని ఆసరా ముఖ్య ఉద్దేశం తెలియచేశారు.గత ప్రభుత్వం లోని అప్పు పూర్తి మొత్తంలో ప్రభుత్వం భరించేలాగా, కొత్త అప్పు మీద వడ్డీ పూర్తిగా ప్రభుత్వమే భరించే లాగా నిర్ణయించిన జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎంతో ఉదాత్త మైనదని రవీంద్ర నాథ్ కొనియాడారు .ఆర్ధిక లోటుపాట్లును తట్టుకొని మహిళలు చేసే ఉత్పత్తులను మార్కెట్లోకి లాభసాటి గా విక్రయాలు చేపట్టడానికి ఈ పధకం ఎంతగానో సహాయపడుతుందని రవీంద్ర అన్నారు .ముఖ్యమంత్రి ముందుచూపుతో విశాఖపట్నం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిలో ఉండేలా జి-20 సమావేశాలు నిర్వహిస్తున్నారని ఇందుమూలంగా ప్రపంచ లోని ఉన్నత స్థితిలో ఉన్న 20 దేశాలు మన రాష్ట్రంలో లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయని చెప్పారు. మండల అధ్యక్షులు కనక దుర్గ అధ్యక్షతన జరిగిన ఈ ఉత్సవాల్లో నియోజక వర్గ కన్వీనియెర్ కవురు శ్రీనివాస్, జడ్పీటీసీ సభ్యులు నడపన గోవింద, జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు మేకా శేషుబాబు, డీసీఎంస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ , ప్రభుత్వ అధికారులు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img