Friday, April 19, 2024
Friday, April 19, 2024

నా భర్తను అన్యాయం గా అరెస్టు చేశారు

నాకు న్యాయం చేయండి

పాలకొల్లు: తన భర్తను అన్యాయంగా అరెస్టు చేశారని, తన భర్త దాసరి రవికుమార్ పై, దాడి చేసిన వ్యక్తిపై పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్లో తాను కేసు పెట్టినప్పటికీ, ఇంతవరకు దాడి చేసిన వ్యక్తి అయిన దొంగ చిరంజీవిని అరెస్టు చేయలేదు సరి కదా పోలీస్ స్టేషన్ కూడా పిలిపించలేదని, పోడూరు మండలం జిన్నూరు గ్రామం సాకిరేవు గుంట కు చెందిన చెందిన దాసరి రవికుమార్ భార్య దాసరి మహని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తను మాత్రం అన్యాయంగా జైలుకు పంపారని ఆమె ఆరోపించారు. తన భర్త పై దాడి చేసిన దొంగ చిరంజీవి నీ, అందుకు కారకులైన వ్యక్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె ఉన్నతాధికారులను కోరారు. ఈ మేరకు బుధవారం ఆమె విలేకరులకు వినతి పత్రం సమర్పించారు. అంతేకాకుండా డబ్బుకు ఆశపడి తన భర్త రవి కుమార్ పై అక్రమ కేసును బనాయించిన పోలీసు సిబ్బందిపై కూడా తక్షణమే చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img