Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎమ్మెల్యే నిమ్మలకు ఫ్లెక్స్ ప్రింటింగ్ ఓనర్స్ వినతిపత్రం

పాలకొల్లు: పాలకొల్లు నర్సాపురం మార్టేరు మొగల్తూరు పెనుగొండ ఆచంట ఫ్లెక్స్ ప్రింటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం పాలకొల్లు శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు కు వినతిపత్రం సమర్పించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఇకపై బ్యాన్ చేస్తున్నానంటూ ముఖ్యమంత్రి జగన్ వైజాగ్ లో చేసిన బహిరంగ ప్రకటన కారణంగా తామంతా ఉపాధి కోల్పోయి వీధిన పడే అవకాశం ఉందని వారు వాపోయారు. పి వి సి100 మైక్రాన్లు లోపు ప్లాస్టిక్ బ్యాన్ నిర్ణయాన్ని మేమంతా తప్పక అనుసరిస్తామని, అయితే ఫ్లెక్సీ ప్లాస్టిక్ కాదని, 180 మైక్రాన్లను కలిగి ఉన్న ఫ్లెక్సీ రీసైకిల్, రీ యూజ్ అవుతుందని వారు ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ విషయం డిపార్ట్మెంట్ ఆఫ్ మెటీరియల్స్ సైన్స్ ఇంజనీరింగ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ వారు ధ్రువీకరించిన టెస్ట్ రిపోర్టులో ఆ విషయం పేర్కొన్నారని గుర్తు చేశారు. ఇప్పటికే కరోనా వల్ల తామంతా చాలా నష్టపోయామన్నారు. లక్షలాది కుటుంబాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఫ్లెక్స్ ప్రింటింగ్ పై ఆధారపడి జీవిస్తున్నారని వారంతా రోడ్లు పడతారని ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని వారు ఎమ్మెల్యే నిమ్మలను వినతిపత్రంలో కోరారు. పాలకొల్లు నర్సాపురం మార్టేరు మొగల్తూరు పెనుగొండ ఆచంట ఫ్లెక్స్ ప్రింటింగ్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img