Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

నిర్మించిన ఏడాదికే రోడ్లపై గుంతలు

కొయ్యలగూడెం: ఏడాది పూర్తి కాకుండానే కోట్లాది రూపాయలతో నిర్మించిన 516 జాతీయ రహదారి పై గోతులు ఏర్పడడంతో వాహనచోదకులు ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. జీలుగుమిల్లి నుండి దేవరపల్లి వరకు రూ.93 కోట్లతో నిర్మించిన 516 జాతీయ రహదారి పనులు పూర్తి కాకుండానే రహదారిపై కుండ గోతులు ఏర్పడ్డాయి. దేవరపల్లి నుండి కొయ్యలగూడెం గ్రామం వరకు జాతీయ రహదారి నిర్మించి 5 నెలలు గడుస్తున్నప్పటికీ, జీలుగుమిల్లి నుండి కొయ్యలగూడెం వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి నూతన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. కొయ్యలగూడెం మండలం అచ్యుతాపురం గ్రామంలో పెట్రోల్ బంక్ వద్ద 516జాతీయ రహదారిపై కుండ గోతులు ఏర్పడడంతో ప్రయాణికులు, వాహనచోదకులు రోడ్డు నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ పై, అధికారులపై, అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోట్లాది రూపాయలతో నిర్మించిన జాతీయ రహదారిపై నిత్యం భారీ వాహనాలు వెళుతూ ఉంటాయని తెలిసి కూడా రహదారి నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ నాణ్యత పాటించలేదని అందువలన రహదారిపై గోతులు ఏర్పడుతున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని వాహనచోదకులు కోరుతున్నారు. సంబంధిత నేషనల్ హైవే డి. ఈ. శ్రీనివాసరావును వివరణ కోరగా రహదారిపై ఏర్పడిన గుంతలకు మరమ్మతులు చేపడతామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img