Wednesday, September 28, 2022
Wednesday, September 28, 2022

సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శిగా బండి వెంకటేశ్వరరావు నియమాకం

ఏలూరు: సిపిఐ రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శిగా బండి వెంకటేశ్వరరావు నుఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈనెల 26, 27, 28 తేదీలలో విశాఖపట్నంలో జరిగిన సిపిఐ 27వ రాష్ట్ర మహాసభలలో సిపిఐ రాష్ట్ర కమిటీ ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు రాష్ట్ర కంట్రోల్ కమిషన్ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు సోమవారం పత్రికలకు వెల్లడించారు.

ఉద్యమ నేపథ్యం…

బండి వెంకటేశ్వరరావు 1979లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) తణుకులో సాధారణ సబ్యునిగా చేరారు. ఏఐఎస్ఎఫ్ తణుకు పట్టణ సహాయ కార్యదర్శిగా, కార్యదర్శిగా, జిల్లా సహాయ కార్యదర్శి,జిల్లా కార్యదర్శిగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా 13 సంవత్సరాల పాటు పని చేశారు. 1992లో అఖిలభారత యువజన సమాఖ్య (ఎఐవై ఎఫ్) జిల్లా కార్యదర్శిగా ఎన్నికై 1998 వరకు కార్యదర్శిగా, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేశారు. 1998లో సిపిఐ ఏలూరు తాలూకా (ఏరియా) కార్యదర్శిగా ఎన్నికై 2006 వరకు పనిచేశారు. 2006లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (బికెఎంయు )జిల్లా కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2006 నుండి
బికెఎంయు జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ 2013 నుంచి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, 2014 నుంచి
బికెయంయు జాతీయ సమితి సభ్యులుగా 2017 నుంచి జాతీయ కార్యవర్గ సభ్యులుగా పనిచేస్తున్నారు. 1998 నుండి పలు కార్మిక సంఘాలకు నాయకునిగా ఎన్నికై 2018 నుంచి
ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. సిపిఐ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సహాయ కార్యదర్శి, కార్యవర్గ సభ్యునిగా పనిచేశారు.
1986 నుంచి 2008 వరకు 22 సంవత్సరాల పాటు పలు దినపత్రికలలో జర్నలిస్టుగా పనిచేశారు. ఏలూరు ప్రెస్ ఫోరం జిల్లా అధ్యక్షులుగా, ఏపిడబ్ల్యూజె జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేశారు. ప్రస్తుతం సిపిఐ ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యులుగా,
బికెయంయు జాతీయ కార్యవర్గ సభ్యులు,రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img