Saturday, August 20, 2022
Saturday, August 20, 2022

ప్రమాదపు అంచుల్లో పులివాగు వంతెన

కొయ్యలగూడెం: పులి వాగు వంతెన పై భారీ వాహనాలు నిత్యం తిరుగుతుండడంతో పూర్తిగా ధ్వంసమై పాడైపోవడంతో వాహనదారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొయ్యలగూడెం బయ్యన గూడెం గ్రామాల మధ్య ఉన్నటువంటి 516 వ జాతీయ రహదారి అద్వానంగా తయారు తయారవడంతో వాహనచోదకులు, ప్రయాణికులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాహనచోదకులు వాహనాలను ఈ రహదారిపై నడిపే క్రమంలో వాహనాలు కూడా మరమ్మతులకు గురవుతున్నాయి. కొయ్యలగూడెం నుండి జంగారెడ్డిగూడెం వరకు ఉన్న ఈ రహదారి కుండ గోతులతో, చెరువులను తలపించె భారీ గోతులతో వర్షం వచ్చినప్పుడు దర్శనమిస్తూ, ఎండ వేస్తే దుమ్ముతో దర్శనమిస్తుంది. ఇదిలా ఉండగా కొయ్యలగూడెం బయ్యన గూడెం గ్రామాల మధ్య ఉన్న శివాలయం వద్ద పులి వాగు వంతెన నిర్మించి కొన్ని సంవత్సరాలు అవుతున్నా రహదారిపై భారీ వాహనాలు అధిక లోడుతో వెళ్లడంతో వంతెనకు నిర్మించడానికి వేసిన ఇనుప ఉసలు సిమెంట్ తొలగిపోయి ఊసలు పైకి కనిపిస్తూ దర్శనమిస్తున్నాయి. ఏ సమయంలో వంతెన కూలి పోతుందో అని వాహనచోదకులు ప్రయాణికులు భయపడుతూ ఈ వంతెనపై ప్రయాణిస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణం స్పందించి వంతెనకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై సంబంధిత జాతీయ రహదారుల
డిఈ శ్రీనివాస రావు వివరణ కోరగా బ్రిడ్జి పై ఏర్పడిన గుంతలకు, పైకి కనిపిస్తున్న ఊసలకు మరమ్మతులు చేపడతామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img