Friday, October 7, 2022
Friday, October 7, 2022

జగన్ అన్న కాలనీ సందర్శించిన రమణ

జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
జిల్లా డి ఎల్ డిఎ రమణ

గణపవరం: రాష్ట్రవ్యాప్తంగా పేదలకు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి విసులుబాటు కల్పించిందని దీనికి లబ్ధిదారులు 10 రోజులలో ఇళ్ళ నిర్మాణం ప్రారంభించాలని ఏలూరు జిల్లా డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ అధికారి జి రమణ అన్నారు. మంగళవారం గణపవరం మండలం పిప్పర గ్రామంలో జగనన్న కాలని సందర్శించి ఇళ్ల స్థలాలను నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని,ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేరాలనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన ఇళ్ళ నిర్మాణ పథకం వినియోగించుకోవాలని కోరారు. ఆయన వెంట గణపవరం ఎంపీడీవో గద్దల జ్యోతిర్మయి, పంచాయతీ కార్యదర్శి బాలకృష్ణ, పంచాయతీ సిబ్బంది, గ్రామ సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img