Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

వృత్తి పట్ల అంకితభావం ఉంటే సమాజంలో గుర్తింపు

బుట్టాయిగూడెం: వృత్తిపట్ల శ్రద్ధతో కూడిన నైపుణ్యతను ప్రదర్శిస్తే సమాజంలో ప్రత్యేక గుర్తింపు వస్తుందని మండల విద్యాశాఖ అధికారి తెల్లం బాబురావు అన్నారు. ఇటీవల గురు పూజోత్సవం సందర్భంగా స్థానిక జడ్పీహెచ్ హైస్కూల్ లో ఇంగ్లీష్ ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న పెద్దింటి శ్రీనివాసరావు ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా విజయవాడలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మండల జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో హైస్కూల్ నందు అవార్డు గ్రహీత శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. ఈ మేరకు మండల విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ తనదైన శైలిలో విద్యా బోధన చేస్తూ రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం అభినందించదగ్గ విషయమన్నారు. విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణను అలవర్చుకుని పని పట్ల శ్రద్ధతో ఉండాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీడీవో వాణి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఈ గంగాదేవి, విద్యా రోహిణి ప్రిన్సిపాల్ కొండెపాటి రామకృష్ణ, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోడూరి ఆనంద్ తదితరులు మాట్లాడి ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మండల విలేకరులు ఎస్ కృష్ణ మోహన్, ఏ నానాజీ, కట్టా నాని,ఎం శ్రీ రామ్ ప్రసాద్,ఎన్ క్రాంతినాధ్,డి వెంకటేశ్వరరావు,కరుణాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img