Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి

కొయ్యలగూడెం: రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని దళిత సేన రాష్ట్ర అధ్యక్షుడు జుజ్జు వరపు రవి ప్రకాష్ పేర్కొన్నారు. బయ్యన గూడెం గ్రామంలో ఏలూరు జిల్లా దళిత సేన అధ్యక్షులు ఉప్పటి వెంకట్రావు అధ్యక్షతన దళిత సేన కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రవి ప్రకాష్ మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో, కార్పొరేట్ పాఠశాలలో విద్యా హక్కు చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని అందుకు రాష్ట్రంలో అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలివ్వాలని ,విద్యాహక్కు చట్టం 4 అధ్యాయం సెక్షన్ 12 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలు, కార్పొరేట్ పాఠశాలలు ప్రాథమిక విద్యలో ఎస్ సి, ఎస్ టి, బీసీ మైనార్టీ బడుగు బలహీనవర్గాల నిరుపేద పిల్లలకు , హెచ్.ఐ.వి పేషెంట్ ల పిల్లలకు, వికలాంగుల పిల్లలకు, సంవత్సరంలో వార్షిక ఆదాయం తక్కువ ఉన్న వారి పిల్లలకు వంద శాతం సీట్లలో 25 శాతం సీట్లు కేటాయించాలన్నారు.ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గ దళిత సేన అధ్యక్షుడు వరిగేటి చిన్నబ్బి, పోలవరం నియోజకవర్గ దళిత సేన ప్రధాన కార్యదర్శి మల్లిపూడి శంకర్రావు, రాష్ట్ర కార్యదర్శి గుంటూరు నవీన్ కుమార్, ఏలూరు జిల్లా సలహా అధ్యక్షులు రావూరి నాగేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పటి వర ప్రసాద్, మిరియాల కిరణ్ ,మల్లిపూడి శంకరయ్య, పూలపల్లి జోజి, ఇందుర్తి చిన్న వెంకటేశు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img