Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

ఎస్ సి,ఎస్ టి, ఉప ప్రణాళిక నిధులు పక్కదారి….

టిడిపి ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ…

విశాలాంధ్ర -ఏలూరు: ఎస్ ఎస్ సి, ఎస్ టి లు ఆర్థికంగా, సామాజికంగా, విద్య, ఉపాధి రంగాల్లో ముందడుగు వేసే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఎస్ సి,ఎస్ టి, ఉప ప్రణాళిక లక్ష్యం పక్కదారి పడుతుందని టిడిపి ఎస్ సి సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ విమర్శించారు. సోమవారం ఎస్ సి,ఎస్ టి నిధులు వారి అభివృద్ధికే వినియోగించాలని కోరుతూ స్పందనలో
జాలా బాలాజీ ఫిర్యాదు చేశారు. అనంతరం బాలాజీ మీడియాతో మాట్లాడుతూ ఉప ప్రణాళిక నిధులు దళిత, గిరిజనులకే ఉపయోగించాలని చట్టం చెపుతున్నా వైసిపి ప్రభుత్వం ఉమ్మడి పథకాలలో కలిపి అమలు చేస్తుందని ఆరోపించారు. ఉప ప్రణాళిక చట్టం ప్రాథమిక లక్ష్యానికి గండి కొడుతుందని విమర్శించారు. ఉప ప్రణాళిక నిధులు పక్కదారి మళ్లిస్తూ ఇతర సంక్షేమ పథకాలకు కేటాయించడం అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి తూట్లు పొడవడమేనని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ గత నాలుగున్నర సంవత్సరాలుగా ఎస్ సి కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయకపోవడం, కార్పొరేషన్లకు నిధులు కేటాయించకపోవడం దుర్మార్గం అన్నారు. ప్రశ్నించే దళితులపై దాడులు చేస్తూ దమనకాండసాగిస్తూ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. గతంలో ఉన్న 27 సంక్షేమ పథకాలను తిరిగి పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కారం కాని పక్షంలో భవిష్యత్తులో దళితుల నుంచి పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి జగన్ కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రేవుల గడ్డ లాలా, చౌటపల్లి శ్రీను, నెల్లిపాక వెంకన్న, లావా కిషోర్, బోయపాటి వీర్రాజు, ఉంగుటూరు మండల ఎస్ సి సెల్ అధ్యక్షులు నేకూరి ఆశీర్వాదం, పొలిమేర సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img