చాట్రాయి ఇన్ చార్జ్ ఎంపిడిఓ మురళీమోహన్
విశాలాంధ్ర – చాట్రాయి : సీజనల్ అంటు వ్యాధుల నిరోధానికి వర్షాకాలం మొత్తం స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఇన్చార్జి ఎంపీడీవో మురళీ మోహన్ తెలిపారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం లోని 18 గ్రామ పంచాయతీల పరిధిలో వర్షాకాలం మొత్తం ముందు జాగ్రత్తతో వలంటీర్లు ఆరోగ్య శాఖ సిబ్బంది సమన్వయం తో పని చేస్తూ ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల ద్వారా వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా పారిశుధ్యం పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. మురికి నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.