Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

ఇళ్ల నిర్మాణం వేగవంతం….

జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి…..

విశాలాంధ్ర భీమవరం: జిల్లాకు సంబంధించిన 72,059 ఇళ్ళ నిర్మాణాల లక్ష్యానికి గాను 25,383 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడం జరిగిందని, మిగిలిన ఇళ్లు కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు.శనివారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యస్.జవహర్ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో హౌసింగ్, రెవెన్యూ, పిఆర్డఆర్ డి, స్వమిత్వ, జాతీయ చేనేత దినోత్సవం, వ్యవసాయం, పశుసంరక్షణ, డెయిరీ డెవలప్‌మెంట్, జగనన్న సురక్ష, జగనన్నకు చెబుదాం, ఆడుదాం ఆంధ్ర, వైయస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులులపై సమీక్ష నిర్వహించారు.
స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి కె.యస్.జవహర్ రెడ్డి ప్రాధాన్యత భవనాలు పెండింగ్ పనులను పూర్తి చెయ్యాలని స్పష్టం చేశారు. హౌసింగ్ కార్యక్రమం కింద స్టేజ్ కన్వర్షన్ పై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. ఁనా నేల – నా దేశంఁ (ఁమేరి మిట్టి, మేరా దేశ్ఁ) ప్రచారం మన సాంస్కృతిక మూలాలను, జాతీయ గుర్తింపును కాపాడుకోవడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పే విధంగా జిల్లా స్థాయిలో ప్రజా ప్రతినిధులతో కూడిన కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. హౌసింగ్ లే అవుట్ లలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పి.ప్రశాంతి వివరాలు తెలియ చేస్తూ, జిల్లాలో 72,059 ఇళ్ళ నిర్మాణ లక్ష్యం కాగా 25,383 ఇళ్ళ నిర్మాణం పూర్తి చేయడం జరిగిందన్నారు.  బిఎల్ తదుపరి స్టేజి కన్వర్షన్ లో 37,254 ఇళ్ళు ఉన్నట్లు తెలిపారు. ఇళ్ళ నిర్మాణాలు పూర్తి అయిన వాటిలో సోప్ పిట్స్ నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.జగనన్నకు చెబుదాంకి సంబంధించి ఈ సంవత్సరం మే 9వ తేదీ నుండి అందిన 6,346 అర్జీలలో 4,844 పరిష్కారం చేశామని తెలిపారు. వీటిలో 1,041 పరిష్కార దశలో ఉన్నాయని, 437 రీ ఓపెన్ అయ్యాయని తెలిపారు. వీటికి సంబంధించిన అధికారులు నేరుగా అర్జిదారులతో సంతృప్తి పరచడం కోసం నేరుగా కలవడం జరుగుతుందని అన్నారు.ఆడుదాం ఆంధ్రా కింద గ్రామ, వార్డు, మండల, నియోజక వర్గ, జిల్లా స్థాయి లో 4 దశల్లో చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక ను అక్టోబర్ 2 నుంచి నవంబర్ 3 వరకు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు.రీ సర్వే కింద 131 గ్రామాలకుగాను 31 గ్రామాల్లో ఫేజ్ 2 సర్వే పూర్తి చెయ్యడం జరిగిందని, మిగిలిన 100 గ్రామాల్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి తహశీల్దార్లుకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఫైనల్ ఆర్ వో ఆర్ కింద తహశీల్దార్, జేసీ లాగిన్ లో పెండింగ్ ఉన్న వాటిని సత్వర పరిష్కారం చేస్తామని తెలిపారు.ప్రాధాన్యత భవనాలు కింద సచివాలయ భవనాలు, అర్భికెలు, హెల్త్ క్లినిక్స్ లు నిర్మాణాలను వేగవంతం చేయడానికి కృషి చేస్తున్నామని, నిర్మాణాలు పూర్తయిన వాటిని ఎప్పటికప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులుచే ప్రారంభించడం జరుగుచున్నదన్నారు. మిగిలిన భవనాలు కూడా అందజేసేందుకు క్షేత్ర స్థాయి అధికారులు దిశా నిర్దేశం చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. జగనన్న పాల వెల్లువ కింద యూనిట్స్ గ్రౌండ్ చేసిన వివరాలు ఆన్లైన్ వెబ్సైట్ లో అప్లోడ్ చెయ్యడం కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామన్నారు.ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img